Renault Duster : రెనాల్ట్ (Renault) అనగానే మనకు గుర్తుకు వచ్చేది డస్టర్(Duster). 2014లో డస్టర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కొన్ని ముఖ్యమైన కార్లకు ఇది పోటీ ఇచ్చి సేల్స్ ను పెంచుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల డస్టర్ ఉత్పత్తిని 2020లో నిలిపివేశారు. ఇప్పుడు చాలా కాలం తరువాత అప్డేట్ ఫీచర్స్ తో పాటు బాహుబలి లాంటి ఇంజన్లను సంతరించుకొని మార్కెట్లోకి రాబోతుంది. ఇటీవల కొత్త డస్టర్ కు సంబంధించిన కొన్ని ఫొటోల లీక్ అయ్యాయి. వీటిని చూసి కారు ప్రియులు ఇంప్రెస్ అవుతున్నారు. మరి ఈ డస్టర్ వివరాల్లోకి వెళితే..
కొత్త రెనాల్ట్ డస్టర్ మస్క్యులర్ స్టాన్స్ ను కలిగి ఉంది. దీంట్లో SUV ఫీచర్స్ ఆకర్షిస్తున్నాయి. వి ఆకారపు లైట్లు, బాక్సీ స్టైలింగ్ లో ఉన్న దీని డిజైన్ ఆకర్షిస్తోంది. దీనికి 17 నుంచి 8 అంగుళాల టైర్లు అమర్చినట్లు తెలుస్తోంది. లోపలి భాగం విషయానికొస్తే 10 అంగుళాల టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో 80 శాతం ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చేయొచ్చు. మైల్డ్ హైబ్రిడ్ తో ఉన్న ఈ మోడల్ 4×4తో అందుబాటులో ఉంది.
SUV విభాగంలో కొత్త డస్టర్ క్రెటీ, సెల్టోస్ వంటి కార్లను పోటీ ఇవ్వనుంది. అయితే కొత్త డస్టర్ లో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్ సౌకర్యం ఉంది. కానీ ఎక్కువగా ఎలక్ట్రిక్ తోనే యూజ్ అవుతుంది. అన్నీ అనుకున్నట్లయితే 2025లో భారత మార్కెట్లోకి కొత్త డస్టర్ రానుంది. దీనికి తోడు 7 సీటర్ డస్టర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దాని పనితీరును కరనబరుస్తున్నారు. అంటే రెనాల్ట్ నుంచి రెండు డస్టర్లు మార్కెట్లోకి రానున్నాయి.