Homeఎంటర్టైన్మెంట్'మత్తు'లో శృతి హాసన్ ను ఫాలో అయిన శింబు !

‘మత్తు’లో శృతి హాసన్ ను ఫాలో అయిన శింబు !

సినిమాకి తాగుడికి అవినాబా సంబంధం ఉంది. అలనాటి తారలు మత్తులో చిత్తు అయి సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటి జనరేషన్ లో కూడా పలువురు పేరొందిన స్టార్స్ తాగుడు, డ్రగ్స్ కి బానిసలుగా మారి, సక్సెస్ ట్రాక్ తప్పి, పర్సనల్ లైఫ్ ను కూడా మిస్ లీడ్ చేసుకుని మొత్తానికి ఫేడ్ అవుట్ అయిన హీరోలు హీరోయిన్లు లెక్కకు మించి ఉన్నారు. అయితే, కెరీర్ ని పాడు చేసుకున్నా, మళ్ళీ నిలబడ్డ వారూ కూడా […]

Simbuసినిమాకి తాగుడికి అవినాబా సంబంధం ఉంది. అలనాటి తారలు మత్తులో చిత్తు అయి సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటి జనరేషన్ లో కూడా పలువురు పేరొందిన స్టార్స్ తాగుడు, డ్రగ్స్ కి బానిసలుగా మారి, సక్సెస్ ట్రాక్ తప్పి, పర్సనల్ లైఫ్ ను కూడా మిస్ లీడ్ చేసుకుని మొత్తానికి ఫేడ్ అవుట్ అయిన హీరోలు హీరోయిన్లు లెక్కకు మించి ఉన్నారు.

అయితే, కెరీర్ ని పాడు చేసుకున్నా, మళ్ళీ నిలబడ్డ వారూ కూడా ఉన్నారు. ఐతే, ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడటానికి వాళ్ళు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది, ఎంతో బాధ పడాల్సి వచ్చింది. దీనికితోడు కెరీర్ ను తీర్చి దిద్దుకోవడానికి మళ్ళీ ఎన్నో అవమానాలు పడ్డారు. అయితే అలాంటి లిస్ట్ లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉంది.

ఒకప్పుడు శృతి హాసన్ మందుకి బానిస. మందు లేనిదే షూటింగ్ కి కూడా వచ్చేది కాదు. కానీ ఆ మత్తులో తన ఆరోగ్యం, జీవితం పాడు అయిపోతోందని గ్రహించిన ఈ ముదురు బ్యూటీ మొత్తానికి మందును మానేసింది. పైగా తన మందు బాపతు గురించి ఆమె స్వయంగా చెప్పుకుని మురిసిపోయింది కూడా.

ఇక శృతి హాసన్ లాగే మందుకు బానిస అయిన హీరో ‘శింబు’. సక్సెస్ ఉన్న టైంలో మందు మొదలుపెట్టి.. చివరకు సక్సెస్ కి కూడా దూరం అయ్యాడు. అయితే ఇతగాడు మందు మానేశాడు. మందు పట్టుకుని ఏడాది అయిందట. తను తాగుడు గురించి శింబునే ఓపెన్ గా చెప్తున్నాడు. మొత్తానికి శింబు కూడా హెల్త్ మీద, ఫిట్ నెస్ ఫైన దృష్టి పెట్టాడు అన్నమాట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper