Sikandar Movie : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. యావరేజ్ సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని చేయగల సత్తా ఉన్న అతి తక్కువ మంది సూపర్ స్టార్స్ లో ఒకరు ఆయన. అయితే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుందని అందరూ అంటుంటారు, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి కూడా అలాంటి బ్యాడ్ ఫేస్ నడుస్తుంది. 2020 కి ముందు బాలీవుడ్ ఆడియన్స్ కి సల్మాన్ ఖాన్ తీసిందే సినిమా, ఆయన ఎలాంటి సినిమాని చేసినా చూస్తాము అన్నట్టగా ఉండేవారు. కానీ కరోనా పీరియడ్ మొదలైన తర్వాత సల్మాన్ ఖాన్ కి బ్యాడ్ టైం మొదలైంది. ఆడియన్స్ లాక్ డౌన్ సమయంలో రకరకాలా ఓటీటీ సినిమాలను చూసి బాగా అప్డేట్ అయిపోయారు.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..దెబ్బ మామూలుగా పడలేదు!
ఇలా ఓటీటీ కి బాగా అలవాటు పడిన ఆడియన్స్ మళ్ళీ థియేటర్స్ కి రావడం అంటే చాలా కష్టం. కచ్చితంగా టికెట్ కొని థియేటర్ కి వెళ్లి సినిమాని చూడాలి అని అనిపించేంత కంటెంట్ దొరికితే మాత్రం ఆకాశమే హద్దు అనే రేంజ్ వసూళ్లను ఇస్తున్నారు. లేదంతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా సరే ఈమధ్య చిల్లర రాలుతుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్(Sikindar Movie) పరిస్థితి అలాగే ఉంది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ఏ ప్రమోషనల్ కంటెంట్ కి కూడా ఫ్యాన్స్ నుండి గొప్ప రెస్పాన్స్ రాలేదు. రొటీన్ కమర్షియల్ గానే అనిపించింది. ఫలితంగా ఓపెనింగ్ వసూళ్లపై గట్టి ప్రభావం పడింది. మొదటి రోజు కేవలం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు ఏకంగా 33 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ ఇండియా వైడ్ గా రెండు రోజులకు కలిపి 63 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా కలుపుకుంటే వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు ఉండొచ్చు. ఇది సల్మాన్ ఖాన్ రేంజ్ కి చిల్లర కలెక్షన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు మొదటి రోజే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నారు. బాలీవుడ్ లో కూడా విక్కీ కౌశల్ స్థాయి నటులు మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో సల్మాన్ ఖాన్ కి వంద కోట్లు కొట్టడానికి 2 రోజుల సమయం పట్టింది అంటే అవమానమే కదా. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి రోజు 90 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తే చిల్లర ఓపెనింగ్స్ అని పిలిచేవారు. అలాంటిది సల్మాన్ ఖాన్ కి మొదటి రోజు కేవలం 48 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందంటే ఏ రేంజ్ చిల్లర అనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం.
Also Read : రాబిన్ హుడ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆల్ టైం డిజాస్టర్ అంటే ఇదే!