L2 Empuraan : మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘L2: ఎంపురాన్'(L2: Empuraan) ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొంత కంటెంట్ వివాదాలకు కూడా దారి తీసింది. హీరో మోహన్ లాల్ స్వయంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అలాంటి వివాదాల మధ్య కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని శాసిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తున్న ఈ చిత్రం, మలయాళం లో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా ఇప్పటికే అవతరించింది. ఇండియా లో వస్తున్న వసూళ్లకంటే ఓవర్సీస్ లో వస్తున్న వసూళ్లు భారీ గా ఉన్నాయి. ఇలా కేవలం మలయాళం సినిమాలకు మాత్రమే జరుగుతుంది.
Also Read : ‘సికిందర్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ ఖాన్ కి ఘోర పరాభవం!
5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేసి గ్రాండ్ గా విడుదల చేశాడు. 5 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు కేవలం కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఫుల్ రన్ లో మహా అయితే మరో కోటి రూపాయిల షేర్ ని రాబట్టొచ్చు, అంతే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడం మాత్రం అసాధ్యం అనే చెప్పాలి. ఇక ఇతర రాష్ట్రాల లెక్కలు ఒకసారి చూస్తే కేరళ లో 5 రోజులకు గాను ఈ చిత్రానికి 53 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం కేరళ నుండే ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఫుల్ రన్ లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదు. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుండి వరల్డ్ వైడ్ గా మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది మోహన్ లాల్, ఇప్పుడు కేరళ నుండి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టబోతున్న హీరో కూడా మోహన్ లాల్ మాత్రమే. అదే విధంగా తమిళనాడు లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 15 కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ నుండి 118 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 5 రోజులకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 94 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ మార్కు కి కేవలం ఆరు కోట్ల రూపాయిలు మాత్రమే కావాలి
Also Read : రాబిన్ హుడ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆల్ టైం డిజాస్టర్ అంటే ఇదే!