Robin Hood Collections : నితిన్(Hero Nithin) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) ఇటీవలే గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనీసం ఈ సినిమాని ఉగాది, రంజాన్ మాసాలు కాపాడుతాయని నిర్మాతలు అనుకున్నారు, కానీ అది జరగలేదు. మరీ ఘోరమైన డిజాస్టర్ గా నిలబడకుండా, కనీసం డబుల్ డిజిట్ షేర్ క్లోజింగ్ కి వచ్చేంత వరకు మాత్రం పుష్ చేసాయి పండుగ హాలిడేస్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్ బోర్ కొట్టేలా ఉండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఫలితం తేడా కొట్టేసింది. డైరెక్టర్ వెంకీ కుడుములు సుమారుగా ఐదేళ్ల నుండి సినిమాలు లేవు. కేవలం ఈ ఒక్క స్క్రిప్ట్ మాత్రమే ఆయన చేతిలో ఉంది. కాస్త ఈ గ్యాప్ లో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసి ఉండుంటే సినిమా హిట్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..దెబ్బ మామూలుగా పడలేదు!
అయితే భీష్మ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 28 కోట్ల రూపాయలకు జరిగింది. టాక్ వస్తే కచ్చితంగా మూడు రోజుల్లో రికవర్ అయ్యే టార్గెట్ ఇది. కానీ టాక్ రాకపోవడంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. రంజాన్ రోజున ఈ రేంజ్ వసూళ్లు అంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక నేడు అయితే కనీసం 8 వేల టిక్కెట్లు కూడా బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయేలా కనిపించడం లేదు. అంతటి దారుణమైన ట్రెండ్ నడుస్తుంది. రేపటి నుండి అసలు బుక్ మై షో ట్రెండింగ్ నుండే ఈ చిత్రం మాయం అయిపోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే ప్రాంతాల వారీగా ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతంలో రెండు కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో 65 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో రెండు కోట్ల 4 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు రావాల్సిన వసూళ్లు నాలుగు రోజులకు కలిపి రావడం అనేది దురదృష్టకరమైన విషయం. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 74 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read : ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన వల్ల ప్రశాంత్ కెరియర్ మారిపోయిందిగా…