Sikandar
Sikandar : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘సికిందర్'(Sikandar Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ సినిమాలకు టాక్ బాగాలేకపోయిన ఓపెనింగ్ వసూళ్లు భారీగా వస్తుంటాయి. కానీ ఎందుకో ఈ సినిమాకి ఓపెనింగ్ వసూళ్లు కూడా గట్టి దెబ్బ వేసింది. మొదటి రోజు ఆదివారం అయ్యినప్పటికీ, బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి కేవలం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బాలీవుడ్ ట్రేడ్ అంచనాలు ఈ సినిమా పై వేరే లెవెల్ లో ఉండేవి. మొదటి రోజు కచ్చితంగా 70 కోట్ల నెట్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ అందులో సగం కూడా రానందుకు ట్రేడ్ షాక్ కి గురైంది.
Also Read : నిరాశపరుస్తున్న ‘సికిందర్’ అడ్వాన్స్ బుకింగ్స్..సల్మాన్ ఖాన్ కు ఏమైంది?
ఇక రెండవ రోజు రంజాన్ కావడం తో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా 33 రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రెండవ రోజు వచ్చినట్టుగా చెప్తున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. కానీ 45 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అనుకుంటే కేవలం 33 కోట్లతో సరిపెట్టిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 63 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజున 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. మూడవ రోజు కూడా హాలిడే కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అలా మూడు రోజులకు గాను ఇండియా వైడ్ గా 93 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పర్వాలేదని అనిపించుకుంది కానీ, అది సల్మాన్ రేంజ్ కి ఏమాత్రం సరితూగని వసూళ్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మూడు రోజుల్లో దాదాపుగా 41 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా గ్రాస్ ప్రకారం చూసుకుంటే ఈ చిత్రానికి మూడు రోజుల్లో 145 కోట్ల రూపాయిలు వచ్చాయి. హాలిడేస్ నిన్నటితో ముగిసిపోయాయి, ఇక నేటి నుండి ఈ చిత్రానికి అసలైన అగ్ని పరీక్ష మొదలైంది. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి గంటకు 6 నుండి 7 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రీసెంట్ గా విడుదలైన సూపర్ హిట్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ ఈ సినిమాకు వచ్చిన ఫ్లాప్ టాక్ ని పరిగణలోకి తీసుకుంటే చాలా డీసెంట్ రేంజ్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే కచ్చితంగా ఈ చిత్రానికి నాల్గవ రోజున 15 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?