https://oktelugu.com/

Salman Khan : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?

Salman Khan : సల్మాన్ ఖాన్(Salman Khan), మురుగదాస్(AR Murugadoss) కాంబినేషన్ లో రష్మిక, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన 'సికిందర్'(Sikindar Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

Written By: , Updated On : March 31, 2025 / 03:32 PM IST
Salman Khan

Salman Khan

Follow us on

Salman Khan : సల్మాన్ ఖాన్(Salman Khan), మురుగదాస్(AR Murugadoss) కాంబినేషన్ లో రష్మిక, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ‘సికిందర్'(Sikindar Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఓపెనింగ్స్ సల్మాన్ ఖాన్ రేంజ్ లో లేవు. ఆదివారం రోజున విడుదలైన సినిమా, పైగా సల్మాన్ ఖాన్ ది అంటే కనీసం 50 కోట్ల రూపాయిల రేంజ్ లో ఓపెనింగ్ వసూళ్లను ఆశిస్తారు ట్రేడ్ పండితులు. కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు, ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ కూడా ఆయన సినిమా వచ్చిందంటే షేక్ అవ్వుద్ది. అలాంటి సల్మాన్ ఖాన్ కెరీర్ లో ‘సికిందర్’ చిత్రం అతి చెత్త ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ఇండియా వైడ్ గా 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట.

Also Read : అవసరమైతే రష్మిక కూతురుతో కూడా నటిస్తా..మీ బాధ ఏంటి – సల్మాన్ ఖాన్

8 ఏళ్ళ క్రితం విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రాలకు ఇంతకు మించిన ఓపెనింగ్ వచ్చింది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన విక్కీ కౌశల్ లాంటి హీరోలు కూడా 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను మొదటి రోజు రాబడుతున్న రోజులివి. అలాంటిది సల్మాన్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి 30 ఓపెనింగ్ అంటే అవమానమే కదా. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి అనుకున్నంత ఓపెనింగ్ రాలేదు. ఓవరాల్ గా చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. సల్మాన్ ఖాన్ కి కరోనా లాక్ డౌన్ తర్వాత అసలు ఏది కలిసి రావట్లేదు. చేస్తున్న ప్రతీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుకు వచ్చాయి. ఈమధ్య కాలం లో మన సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ ని దున్నేస్తున్నారు.

ముఖ్యంగా అట్లీ షారుక్ ఖాన్ తో ‘జవాన్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా సందీప్ వంగ కూడా సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్లి భారీ హిట్స్ ని అందుకున్నాడు. సౌత్ డైరెక్టర్స్ అయితే కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్స్ ఇస్తారనే నమ్మకంతో ఆయన మురుగదాస్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఈ విషయం సల్మాన్ ఖాన్ కి తెలుసో తెలియదో మనకి తెలియదు. మురుగదాస్ ఫామ్ కోల్పోయి చాలా కాలం అయ్యిందని , ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటి సమయంల సికందర్ చిత్రం చేశాడు. సినిమా స్టోరీ, కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ టేకింగ్ చాలా రొటీన్ గా, స్లో స్క్రీన్ ప్లే తో ఉండడం వల్లే, ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

Also Read : సల్మాన్ ఇంట్లో ఆ 3 రోజులు మర్చిపోలేను- సుదీప్ కూతురు శాన్వీ!