Siddharth , Taman
Siddharth and Taman : ప్రస్తుతం సౌత్ ఇండియా లో మంచి డిమాండ్ ఉన్న టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్(SS Thaman) పేరు కచ్చితంగా ఉంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ(Manisharma) వద్ద శిష్యరికం చేసి, అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసాడు. ఇతని పనితనం నచ్చి సురేందర్ రెడ్డి తానూ రవితేజ తో చేస్తున్న ‘కిక్’ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా మ్యూజిక్ పెద్ద హిట్ అవ్వడంతో తమన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే రెండు మూడు సినిమాలలో కనీసం ఒక్కటైనా తమన్ మ్యూజిక్ అందించిన చిత్రం ఉంటుంది. ఆ రేంజ్ బిజీ మ్యూజిషియన్ ఆయన. ఆయన సంగీతం అందించిన లేటెస్ట్ చిత్రం ‘శబ్దం’ నేడు విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
Also Read : ‘గేమ్ చేంజర్’ విషయంలో రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన తమన్..వైరల్ అవుతున్న ట్వీట్!
ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు తమన్. ఒక ఇంటర్వ్యూ లో బాయ్స్ సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘బాయ్స్ మూవీ షూటింగ్ సమయంలో నాకు, హీరో సిద్దార్థ్(Hero Siddarth) కి చాలా గొడవలు జరిగేవి. సిద్దార్థ్ ఒక్కోసారి నాతో, నేను ఈ చిత్రం లో హీరోని రా అనేవాడు. అప్పుడు నేను నువ్వు ఎవరైతే నాకేంటి, నీకంటే నేనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను అనే వాడిని. అతన్ని పాపం చాలా టార్చర్ పెట్టేవాడిని. ఒకరోజు షూటింగ్ లో సిద్దార్థ్ కి నైకీ సాక్స్ ఇచ్చి నాకు సాధారణమైన సాక్స్ ఇచ్చారు. నాకు పిచ్చకోపం వచ్చింది, నా సాక్స్ తీసుకెళ్లి నిర్మాత ఏఏం రత్నం గారి ముందు పడేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘బాయ్స్ సినిమాకి అరివళగన్ అసోసియేటివ్ డైరెక్టర్ గా పని చేసేవాడు. పాపం శంకర్ గారి దగ్గర దర్సకత్వం నేర్చుకోవడానికి వచ్చిన ఆయనకు నరకం అంటే ఏంటో చూపించాను. క్యార వ్యాన్ లో ప్లగ్ పీకేసి కరెంటు బంద్ చేసేవాడిని, బాత్రూం కి కనెక్షన్ ఉండే నీళ్ల పైప్ ని కట్ చేసేవాడిని. పాపం అరివళగన్ గారికి నన్ను కంట్రోల్ చేయడమే పని అయిపోయింది’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో ఎందుకు ఇలా చేసావు?, నీకు ఏమైనా పిచ్చా అంటూ నెటిజన్స్ తమన్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తమన్ చేతిలో ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే.
Also Read : తమన్ కి బాలయ్య పేరు చెప్పిన విజువల్ చూసిన పూనకాలు వస్తాయా..?