మల్టీ స్టారర్ చిత్రాలకు హిందీలో ఉన్నంత వెసులు బాటు తెలుగు సినీ పరిశ్రమలో ఉండదు. ఇక్కడ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలు చేయాలంటే అనేక విధాలుగా ఆలోచిస్తారు. ఒక పట్టాన అడ్జస్ట్ కారు. అందుకే తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. ఇపుడు ఆ ఇబ్బందే ఒక దర్శకుడుకి వచ్చింది. “ఆర్ ఎక్స్ 100 ” సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి, ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. దానిక్కారణం అజయ్ భూపతి సిద్ధం చేసుకున్న ‘మహాసముద్రం’ అనే మల్టీ స్టారర్ కథ పట్ల కథానాయకులు ఆసక్తిని చూపకపోవడమే అని తెలుస్తోంది. .
సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!
ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులకు ప్రాధాన్యత ఉంటుంది. ఒక కథానాయకుడి పాత్రకిగాను శర్వానంద్ ను ఎంపిక చేసిన అజయ్ భూపతి, మరో కథానాయకుడి పాత్ర కోసం ఇంతకాలం అన్వేషిస్తూ వచ్చాడు. చివరకు బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ చిత్రం లో శర్వానంద్ జోడీగా సాయిపల్లవిని నటిస్తుంటే , సిద్ధార్థ్ సరసన జోడీ ఇంకా ఫిక్స్ కాలేదు. గతంలో” బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా “వంటి వరుస హిట్ సినిమాలు చేసిన సిద్ధార్థ్ కి తెలుగులో మంచి క్రేజ్ వుంది. దరిమిలా సిద్దార్థ ని రెండో హీరోగా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది .