https://oktelugu.com/

రాష్ట్రంలో 79 వెరీ యాక్టివ్ కరోనా క్లస్టర్లు..!

ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు ఉండగా 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు, 68 యాక్టివ్‌ క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని వెల్లడించిన అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరీక్షలు లక్ష దాటాయి. ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 పరీక్షలు నిర్వహించగా, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు జరిపారు. జగన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 1, 2020 3:50 pm
    Follow us on


    ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు ఉండగా 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు, 68 యాక్టివ్‌ క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని వెల్లడించిన అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరీక్షలు లక్ష దాటాయి. ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 పరీక్షలు నిర్వహించగా, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు జరిపారు.

    జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

    ప్రతిమిలియన్‌ ప్రజలకు 1,919 మందికి పరీక్షలు నిర్వహించి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం నిలిచింది. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కృష్ణబాబుకు బాధ్యత అప్పగించారు. సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు అధికారులు తీసుకుంటున్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ నంబర్‌ తమ వద్ద ఉందని, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని తెలియజేసిన అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.

    సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

    లాక్‌డౌన్‌ సడలింపులు నేపథ్యంలో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో జరిగింది. వీరిని స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సమీక్షించారు. వీరి సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న సీఎం ఆదేశించారు. ఎవరిని క్వారంటైన్లో పెట్టాలి, ఎవర్ని ఎక్కడ పెట్టాలి అన్నదానిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని ఆదేశించారు.

    అలాగే వివిధ రాష్ట్రాలనుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలన్నారు.విదేశాల నుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

    అలాగే గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని, అలాగే శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

    కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారుల వెల్లడి. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించారు. వీరికి పరీక్షలు చేసి, లక్షణాలు ఉంటే ముందస్తు వైద్యం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని ఆదేశం. హైరిస్క్‌ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్‌ చేస్తే వెంటనే వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం, భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నిర్ణయించారు.టెలీమెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ పొందడం, అక్కడ నుంచి నేరుగా విలేజ్‌ క్లినిక్‌ ద్వారా మందులు సరఫరా చేయడం జరగాలన్న సీఎం ఆదేశించారు.