రేపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్న మోదీ

ఇంకో రెండ్రోజుల్లో కేంద్రం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. తొలి విడుత లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నుంచి లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో తొలివిడుత లాక్డౌన్ 21రోజులు జరిగింది. ఇక రెండో విడుత లాక్డౌన్ 19రోజులపాటు అంటే మే 3వరకు సాగనుంది. ఈనేపథ్యంలోనే మరోసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈసారి మోదీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 4:46 pm
Follow us on


ఇంకో రెండ్రోజుల్లో కేంద్రం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. తొలి విడుత లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నుంచి లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో తొలివిడుత లాక్డౌన్ 21రోజులు జరిగింది. ఇక రెండో విడుత లాక్డౌన్ 19రోజులపాటు అంటే మే 3వరకు సాగనుంది. ఈనేపథ్యంలోనే మరోసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈసారి మోదీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

లాక్ డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని మోదీ అధ్యక్షతన తాజాగా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయ‌ల్‌, కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబాతోపాటు పలువురు ఉన్న‌త స్థాయి అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా పరిస్థితి.. లాక్డౌన్ కొన‌సాగింపు, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. ఈమేరకు ప్రధాని మోదీ రేపు ఉదయం 10గంటలకు జాతీనుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది.

రాష్ట్రంలో 79 వెరీ యాక్టివ్ కరోనా క్లస్టర్లు..!

ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం అభిప్రాయాలను తీసుకున్నారు. మెజార్టీ సీఎంలు లాక్డౌన్ కొనసాగించాలని.. మరికొందరు సడలించాలని కోరారు. ఈనేపథ్యంలో ప్రధాని రేపు లాక్డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే ఆసక్తి దేశ ప్రజల్లో నెలకొంది.