Shyamala
Shyamala : బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీల పై కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపుగా 25 మంది సెలబ్రిటీలు ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devaarkonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), రానా దగ్గుబాటి(Rana Daggubati) వంటి ప్రముఖులు ఉన్నారు. వీళ్ళతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న యాంకర్ శ్యామల వంటి వారిపై కూడా ఈ కేసు నమోదైంది. అయితే నేడు యాంకర్ శ్యామల(Anchor Shyamala) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ విచారణకు హాజరు అవుతుందని ఆశిస్తే, ఆమె హై కోర్టు మెట్లు ఎక్కి, క్వాష్ పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. కానీ ఎందుకు కేసులు కొట్టేయాలి అనే దానిపై మాత్రం ఆమె మీడియా కు ఇంత వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Also Read : యాంకర్ శ్యామల అరెస్ట్ కి లైన్ క్లియర్..? అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందిగా!
ఈమెతో పాటు కేసులు నమోదైన ప్రతీ సెలబ్రిటీ సోషల్ మీడియా లో స్పందించారు. ఎదో తెలియక తప్పు చేసాము, ఇక మీదట ఇలాంటివి చేయము, జనాల్లో వీటిపై అవగాహన కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. నిన్న ప్రకాష్ రాజ్ కూడా దీనిపై స్పందిస్తూ అప్పట్లో తెలియక చేశాను, తెలిసిన తర్వాత కాంట్రాక్టు రద్దు చేసుకున్నాను, అప్పట్లో నేను ప్రమోట్ చేయడం తప్పే అని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ యాంకర్ శ్యామల మాత్రం అలాంటి వివరణ ఏమి ఇవ్వలేదు. నేరుగా హై కోర్టు మెట్లు ఎక్కింది. వైసీపీ పార్టీ లో ఉంటూ, కూటమి ప్రభుత్వం లో చీమ చిటుక్కుమన్నా ప్రెస్ మీట్ పెట్టి స్పందించే యాంకర్ శ్యామల తనపై కేసు నమోదైతే జనాలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదా?, ఇంత యాటిట్యూడ్ ఎందుకు?, నిన్న మొన్నటి వరకు చిన్నా చితక ఈవెంట్స్ చేసుకునే శ్యామలకు ఏమి చూసుకొని ఇంత పొగరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆమెను ఏకిపారేస్తున్నారు.
కనీసం ఇప్పుడైనా ఆమె వివరణ ఇస్తుందో లేదో చూడాలి. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసాము, ఇప్పుడు చేయడం లేదు అనడానికి లేదు. ఆమె రాజకీయ అరంగేట్రం చేయక ముందు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది. సెలబ్రిటీలందరికీ ఒక రూల్, శ్యామల కి ఒక్కటి మరో రూల్ అన్నట్టు ఎక్కడా రాసిపెట్టలేదు. కాబట్టి ఆమె వేసిన క్వాష్ పిటీషన్ ని కొట్టివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈమె క్వాష్ పిటీషన్ కి హై కోర్టు ఆమోదం తెలిపితే మాత్రం అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. చూడాలి మరి శ్యామల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఎదురుకోబోతుంది అనేది. ఏది ఏమైనా ఒక రాజకీయ జీవితాన్ని ప్రారంభించే ముందు ఇలా యువతని తప్పు దోవ పట్టించే యాప్స్ ని ప్రమోట్ చేయడం అత్యంత హేయమైన చర్య.
Also Read : యాంకర్ శ్యామల ఆన్ డ్యూటీ.. వస్తూనే చంద్రబాబు పై హాట్ కామెంట్స్*