Aurangzeb Tomb : ఛావా సినిమా.. జనాలపై ఎంత ప్రభావితం చేసిందంటే? ఔరంగజేబు సమాధిని కూల్చడానికి ప్రజలు వెళ్లారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదేం కొత్తది కాదు తీసింది. చరిత్రలో జరిగిందే చావా మూవీ తీశారు. చరిత్రలో శంభాజీ మహారాజ్ ఎలా చనిపోయాడో తెలుసు.. ఔరంగజేబు ఎంత దుర్మార్గుడో తెలుసు. అయినా మనం ఎందుకు అంత కోపంగా రియాక్ట్ అయ్యామంటే.. చరిత్ర ఎవరు చదవలేదు కాబట్టి.. సినిమాగా తీశారు కాబట్టి చూసి జీర్ణించుకోలేకపోయారు.
చరిత్రను చరిత్రగా చదవకపోవడం వల్లే ఇది అయ్యింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ‘హైందవం చైతన్యం’ పెరిగింది. హిందువుల్లో ఐక్యత వచ్చింది. ఔరంగజేబు దుర్మార్గాలు చెబితే కొందరు గింజుకుంటున్నారు. కాశీ విశ్వనాథ గోడకు మసీదు కట్టారు. కృష్ణ జన్మస్థానంలోనూ మసీదు కట్టారు. ఇవి సహా శంభాల్, కల్కి మహారాజ్ కూల్చివేతలోనూ నాడు ఔరంగజేబు హయాంలోనే జరిగాయి..
సమాధి తీసేస్తే ఔరంగజేబు దుర్మార్గాలు మాసిపోతాయా? చరిత్ర సమసిపోతుందా? పెకిలించాల్సింది ఔరంగజేబు సమాధి కాదు.. ఇప్పటి ఔరంగజేబు ఆలోచనలను రూపుమాపాలి. ఆల్ ఖైదా, ఐసిస్ లాంటి దుర్మార్గాలను అణచివేయాలి.
ఔరంగజేబు సమాధి కూలగొడితే చరిత్ర మాసిపోద్దా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.