Homeఎంటర్టైన్మెంట్స్పీడ్ పెంచేసిన ‘శ్యామ్‌ సింగ్ రాయ్' !

స్పీడ్ పెంచేసిన ‘శ్యామ్‌ సింగ్ రాయ్’ !

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ప్రస్తుతం నిన్నుకోరి, మజిలీ లాంటి క్లాసిక్ మూవీస్ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో పాటుగా ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగ్ రాయ్’ మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ మూవీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. Also Read: మెగా ఫ్యామిలీలో సెటిల్ […]

Shyam Singha Roy
నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ప్రస్తుతం నిన్నుకోరి, మజిలీ లాంటి క్లాసిక్ మూవీస్ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో పాటుగా ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగ్ రాయ్’ మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ మూవీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

Also Read: మెగా ఫ్యామిలీలో సెటిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ !

నాని కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రంగా శ్యామ్‌ సింగ్ రాయ్ మూవీ తెరకెక్కబోతుంది. కోల్‌కత్తా నేపథ్యంలో పీరియాడికల్‌ మూవీగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ కూడా వేశారని తెలుస్తుంది. ఈ నెల 13 వరకూ హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత సంక్రాంతి పండగ బ్రేక్‌ తీసుకుని, మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారు. ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చెయ్యాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అందుకే శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

Also Read: తప్పుకున్న రానా.. కారణం అదే..

ఛాలెంజింగ్ పాత్రలను ఇష్టపడే నాని ఈ మూవీలో మరోసారి ద్విపాత్రాభినయంతో నట విశ్వరూపం చూయించబోతున్నాడని సమాచారం. ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జెర్సీ ఫేమ్ సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ మరియు మిక్కిజేమేయర్ సంగీతం అందించనున్నారు. నిహారికా ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్‌ బోయిన్‌పల్లి నిర్మిస్తున్న ఈ మూవీని ఈ సంవత్సరం రెండవ భాగంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper