Chiranjeevi- Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. పైగా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. సినిమాకి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇంకా స్టడీగానే థియేటర్ రెవెన్యూను ఈ చిత్రం సాధించింది. మొత్తమ్మీద శ్యామ్ సింగరాయ్‌తో హిట్టు కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.

Also Read: ‘సమంత’ షాకింగ్ నిర్ణయం.. చైతు తో మళ్లీ కలుస్తుందా ?
ఇటీవల శ్యామ్ సింగరాయ్ చూసిన చిరు దంపతులు నానిని ఇంటికి ఆహ్వానించడంతో వెళ్లాడు. నానికి బొకే ఇచ్చి అభినందించిన చిరు.. ‘నువ్వు దీని కంటే మరెన్నో ప్రశంసలకు అర్హుడివి’ అని పొగిడారు. అనంతరం ఇద్దరూ కలిసి శ్యామ్ సింగరాయ్ స్టైల్‌లో మీసం మెలేశారు. గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. గత నెల 24న విడుదలైన నాని, సాయి పల్లవిల ‘శ్యామ్ సింగరాయ్’ అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమా లాభనష్టాలన్నీ నిర్మాతకే సొంతం. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 33 కోట్లు రాబట్టింది. అంటే పూర్తి లాభాల్లోకి ‘శ్యామ్ సింగ రాయ్’ వెళ్ళిపోయాడు. కానీ ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడ ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. మిగిలిన చోట్ల కలెక్షన్స్ బాగుండటంతో శ్యామ్ బయట పడ్డాడు. ఏది ఏమైన సినిమా హిట్ అవ్వడంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు.
Also Read: మంత్రి అనిల్ కుమార్ పై హైదరాబాద్‌లో కేసు.. ఆడేసుకుంటున్న టీడీపీ నేతలు..!