Vijay Devarakonda: డీసెంట్ డైరెక్టర్ గా శివ నిర్వాణకి మంచి పేరు ఉంది. అయితే, నానితో చేసిన టక్ జగదీష్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ కి ముందు వరకూ హీరోలు.. శివ చుట్టూ తిరిగారు. ఆ తిరిగిన వాళ్ళల్లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. పైగా విజయ్ దేవరకొండతో తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణతోనే చేస్తున్నాను అంటూ ప్లాన్ చేశాడు, ఒక పోస్టర్ కూడా వదిలాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి సినిమాలు హిట్ తర్వాత, శివ నిర్వాణ పై అందరికీ నమ్మకం పెరిగింది.
Vijay Devarakonda
కానీ, ‘టక్ జగదీష్’తో ప్లాప్ అయ్యాడు శివ నిర్వాణ. అందుకే, విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ చేయాల్సిన మూవీ క్యాన్సిల్ అయిందని.. శివ నిర్వాణ గత చిత్రం ‘టక్ జగదీష్’ ఫ్లాప్ అవ్వపోవడంతో, విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై శివ స్పందించాడు. ఈ వార్తలన్ని కేవలం రూమర్సేనని క్లారిటీ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా శివ నిర్వాణ – విజయ్ దేవరకొండల కాంబోలో మూవీ ఉంటుందని తెలుస్తోంది.
Also Read: ‘సమంత’ షాకింగ్ నిర్ణయం.. చైతు తో మళ్లీ కలుస్తుందా ?
Vijay Devarakonda
కాగా విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డాడని ఇంకా రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు శివ నిర్వాణకు డేట్లు ఇవ్వాలా ? వద్దా ? తన కెరీర్ కూడా రిస్క్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాట కోసం ముందు వెళ్తే.. కెరీరే ఉండదేమో అనే భయంలో ఉన్నాడు విజయ్. విజయ్ సినిమా కోసం శివ నిర్వాణ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తి అయింది. మరి ఈ సినిమా ఉంటుందో ఉండదో చూడాలి. కానీ విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణకి డేట్స్ ఇవ్వకపోతే.. శివ కెరీర్ కష్టమే.
Also Read: ‘సమంత’ షాకింగ్ నిర్ణయం.. చైతు తో మళ్లీ కలుస్తుందా ?