https://oktelugu.com/

Shruti Haasan: నా బాడీ లో ఆ రెండు పార్ట్శ్ అంటే చాలా ఇష్టం… శృతి బోల్డ్ ఆన్సర్!

Shruti Haasan: ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో శృతి హాసన్ నెటిజెన్స్ కి షాక్ ఇస్తూ ఉంటారు. జీవితం చాలా చిన్నది, నచ్చినట్లు బ్రతకడమే తన సిద్ధాంతం అంటుంది ఈ అమ్మడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం ఏకోశాన ఉండదు.సమాజాన్ని అస్సలు పట్టించుకోదు. నచ్చిన పని పబ్లిక్ గా చేసేస్తూ ఉంటుంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి పాత్ర ఎంపికలలో పూర్తి స్వేచ్ఛ కలిగివున్నారు. అందుకే అమ్మడు కెరీర్ […]

Written By: , Updated On : January 21, 2022 / 01:17 PM IST
Follow us on

Shruti Haasan: ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో శృతి హాసన్ నెటిజెన్స్ కి షాక్ ఇస్తూ ఉంటారు. జీవితం చాలా చిన్నది, నచ్చినట్లు బ్రతకడమే తన సిద్ధాంతం అంటుంది ఈ అమ్మడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం ఏకోశాన ఉండదు.సమాజాన్ని అస్సలు పట్టించుకోదు. నచ్చిన పని పబ్లిక్ గా చేసేస్తూ ఉంటుంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి పాత్ర ఎంపికలలో పూర్తి స్వేచ్ఛ కలిగివున్నారు. అందుకే అమ్మడు కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేశారు. డి డే వంటి చిత్రాల్లో శ్రుతి నటించిన సన్నివేశాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

ఇక కెరీర్ బిగినింగ్ లో అమ్మడుకి సరైన బ్రేక్ రాలేదు. నటించిన చిత్రాలన్నీ పరాజయం కావడంతో ఐరన్ లెగ్ అన్న నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ ఆ తర్వాత పుంజుకున్నారు. శ్రీమంతుడు, రేసు గుర్రం వంటి చిత్రాలు ఆమెకు భారీ విజయాలు కట్టబెట్టాయి. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో ప్రేమ పిచ్చిపట్టి లండన్ ప్రియుడితో అక్కడకు వెళ్ళిపోయింది. డీప్ గా రెండేళ్లకు పైగా ప్రేమించుకున్న ఈ జంట 2019లో విడిపోయారు.

Also Read: కొడాలి నాని ‘క్యాసినో’పై పడ్డ టీడీపీ.. గుడివాడలో గడబిడ

ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి కొత్త ప్రియుడు శాంతను హజారికతో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ముంబైలో శృతి అతనితోనే ఉంటుంది. కాగా శృతి అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా చాట్ చేశారు. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ నెటిజెన్.. మీకు మీ బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం అని అడిగాడు. దానికి శృతి హాసన్ తడుముకోకుండా.. నా శరీరంలో అన్ని అవయవాలు నాకు ఇష్టమే. కాకపోతే నా మెదడు, హృదయం అంటే మరింత ఇష్టం అంటూ సమాధానం చెప్పింది.

Shruti Haasan

Shruti Haasan

నెటిజెన్ ఏదో ఆశించి ఆ ప్రశ్న అడిగితే శృతి తెలివిగా సమాధానం చెప్పింది. ఇక శృతి కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది అనుకుంటున్న తరుణంలో క్రేజీ ఆఫర్స్ ఆమెకు దక్కుతున్నాయి. క్రాక్, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన శృతి హాసన్, ప్రభాస్ సలార్ చిత్రంలో ఆఫర్ కొట్టేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక శృతి ఫేవరేట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమా కోసం శృతి హాసన్ ని ఎంపిక చేసుకున్నాడు.

Also Read: అవును.. ఆమె నేటి సూర్యకాంతం !

Tags