Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదల కాబోతోంది. దీనిపై అందరికి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడేళ్ల క్రితం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో అభిమానులను పలకరించనున్నాడు. దీంతో సినిమా కోసం అభిమానులు వేచి ఉన్నారు. బాహుబలితో క్రేజీ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాలో ఏమేరకు ఆకట్టుకోనున్నాడో చూడాల్సిందే. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. దాదాపు ఏడు వేల థియేటర్లలో రాధేశ్యామ్ ఆడనుంది.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులో కృష్ణంరాజు, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ తదితరులు నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. దీంతో రాధేశ్యామ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమాకు ధరలు తగ్గించిన ప్రభుత్వం రాధేశ్యామ్ కు మాత్రం పెంచుకునే అవకాశం ఇవ్వడం గమనార్హం.
Also Read: ‘రాదేశ్యామ్’ పై రాజమౌళి రివ్యూ ఇదే
వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని గతంలో చెప్పిన విధంగానే జగన్ ప్రభుత్వం ఈ మేరకు రాధేశ్యామ్ కు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో రాధేశ్యామ్ సినిమా గట్టెక్కనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల ధరల విషయంలో చివరి క్షణంలో సినిమా పరిశ్రమకు అనుగుణంగానే జీవో జారీ చేసింది. ఐదో ఆటకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. దీంతో రాధేశ్యామ్ కు అన్ని శుభ పరిణామాలే అని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ఆఫర్లతో రాధేశ్యామ్ సినిమా విజయవంతంగా ప్రదర్శించేందుకు అవకాశం ఏర్పడింది. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ కు మాత్రం ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. పవన్ కల్యాణ్ పై ఉన్న కోపంతోనే జగన్ ఇలా చేశారనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ రాధేశ్యామ్ కు మాత్రం అన్ని మార్గాలు సుగమం కావడంతో ఇక ప్రభాస్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: ‘రాధేశ్యామ్’ పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్