https://oktelugu.com/

Shruti Hassan Viral Post: బాగా నీరసించిపోయాను అంటున్న స్టార్ హీరోయిన్

Shruti Hassan Viral Post: ఎప్పటికప్పుడు ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో శృతి హాసన్ నెటిజెన్స్ కి షాక్ ఇస్తూ ఉంటుంది.అన్నట్టు శృతి హాసన్‌‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి పై శృతి హాసన్ పోస్ట్ పెట్టింది. శ్రుతి తాజాగా ఐసోలేషన్‌లోని తన కష్టాల గురించి చెబుతూ ‘కరోనాతో బాగా నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’ అని బాధగా మెసేజ్ చేసింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 02:09 PM IST
    Follow us on

    Shruti Hassan Viral Post: ఎప్పటికప్పుడు ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో శృతి హాసన్ నెటిజెన్స్ కి షాక్ ఇస్తూ ఉంటుంది.అన్నట్టు శృతి హాసన్‌‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి పై శృతి హాసన్ పోస్ట్ పెట్టింది. శ్రుతి తాజాగా ఐసోలేషన్‌లోని తన కష్టాల గురించి చెబుతూ ‘కరోనాతో బాగా నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’ అని బాధగా మెసేజ్ చేసింది.

    Shruti Haasan

    ఆమె మెసేజ్ చూసిన అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటికి బదులిచ్చిన శృతీ హాసన్‌.. మీ అందరి ఆశీస్సులతో త్వరలో పూర్తిగా కోలుకొని మీ ముందుకు వస్తాను అంటూ ఆమె తెలిపింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడి, కోలుకున్నారు.

    Also Read:  టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    ఇక శృతి హాసన్ వేదాంతం కూడా చెబుతుంది. జీవితం చాలా చిన్నది, నచ్చినట్లు బ్రతకడమే తన సిద్ధాంతం అంటుంది ఈ అమ్మడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం ఏ కోశాన ఆమెకు ఉండదు. ఆమె సమాజాన్ని అస్సలు పట్టించుకోదు. నచ్చిన పని పబ్లిక్ గా చేసేస్తూ ఉంటుంది. ఇక కెరీర్ బిగినింగ్ లో అమ్మడుకి సరైన బ్రేక్ రాలేదు. నటించిన చిత్రాలన్నీ పరాజయం కావడంతో ఐరన్ లెగ్ అన్న నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది.

    Shruti Haasan

    అయితే గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ ఆ తర్వాత పుంజుకున్నారు. శ్రీమంతుడు, రేసు గుర్రం వంటి చిత్రాలు ఆమెకు భారీ విజయాలు కట్టబెట్టాయి. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో ప్రేమ పిచ్చిపట్టి లండన్ ప్రియుడితో అక్కడకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం కొత్త ప్రియుడు శాంతను హజారికతో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ముంబైలో శృతి అతనితోనే ఉంటుంది.

    Also Read:  ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?

    Tags