https://oktelugu.com/

Krithi Shetty: కృతి శెట్టి ‘కొత్త కొత్తగా’.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది !

Krithi Shetty: సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలోని ‘కొత్త కొత్తగా’ లిరికల్ సాంగ్ తాజాగా విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాయగా.. చైత్ర, అభయ్ పాడారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. మొత్తానికి సాంగ్ అయితే బాగుంది. మెయిన్ గా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. అయితే.. ఈ సినిమాలో కృతి శెట్టినే మెయిన్ అట్రాక్షన్ అయింది. ఇంద్ర‌గంటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 01:56 PM IST
    Follow us on

    Krithi Shetty: సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలోని ‘కొత్త కొత్తగా’ లిరికల్ సాంగ్ తాజాగా విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాయగా.. చైత్ర, అభయ్ పాడారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. మొత్తానికి సాంగ్ అయితే బాగుంది. మెయిన్ గా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.

    Krithi Shetty

    అయితే.. ఈ సినిమాలో కృతి శెట్టినే మెయిన్ అట్రాక్షన్ అయింది. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ డైరెక్ష‌న్ లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వడానికి.. కృతి ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసింది. ఈ సినిమా మొత్తం ఈ బ్యూటీ మీదే నడుస్తోందట. టైటిల్ కూడా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికరంగా పెట్టారు. తన పాత్ర మీదే టైటిల్‌ ను ఫైన‌ల్ చేశారంటే.. సినిమాలో కృతి శెట్టికి ఇచ్చిన ప్రాముఖ్యత అర్ధమవుతుంది.

    Also Read: శంక‌ర్ ఆఫ‌ర్ ఇస్తే వ‌ద్ద‌న్న అబ్బాస్‌.. బ్లాక్ బ‌స్టర్ మిస్ చేసుకున్నాడే..!

    అందుకే ఈ ‘కొత్త కొత్తగా’ లిరికల్ సాంగ్ ను కూడా కృతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కట్ చేశారు. ఏది ఏమైనా కృతి శెట్టికి బాగా కలిసి వచ్చింది. పైగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల లిస్ట్ కూడా తక్కువగా ఉండటం.. ఉన్న హీరోయిన్స్ లో పెద్దగా పోటీ ఇచ్చే వారే లేకపోవడం.. మొత్తానికి కృతి శెట్టికి టైం కలిసి వచ్చింది. అందుకే ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి సుమారు రూ. రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అమ్మడు ఎంత అడిగినా మేకర్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

    Krithi Shetty

    తనకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే కృతి.. తన మేకప్ అండ్ తన సెటప్ ఖర్చులు కోసం అదనంగా రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తోందట. మొత్తానికి తన లక్ ను అర్ధం చేసుకున్న కృతి శెట్టి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతుంది. ఇక సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సమ్మోహనం మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    Also Read:  మహేష్ బాబుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి !

    Tags