Dhanush- Aishwarya: తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్న అంశం పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాక, మొదటిసారి ఈ ఇద్దరూ ఒకచోట కలిశారు. తాజాగా చెన్నైలో కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి ఇద్దరూ హాజరయ్యారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, పార్టీలో పాల్గొన్నా, ఒకరికొకరు ఎదురు పడ్డా కనీసం పలకరించుకోలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇద్దరూ ఒకే హోటల్‌లో దిగారు. అయినా మాట్లాడుకోవడం లేదట. మరి ఈ జంట విడాకుల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని అర్ధం అవుతుంది.
Also Read: బాగా నీరసించిపోయాను అంటున్న స్టార్ హీరోయిన్
ఇప్పటికే ధనుష్ – ఐశ్వర్య ఇద్దరితో రజిని మాట్లాడాడట. 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని చిన్న ఇగోతో పాడు చేసుకోవద్దు అని, అయినా ఎందుకు సడెన్ గా మీ బంధానికి ముగింపు పలుకుతున్నారో ? ఒకసారి మీరే ఆలోచించుకోవాలని రజిని క్లాస్ తీసుకున్నారట. నిజానికి ధనుష్ తో ఐశ్వర్య పెళ్ళికి రజినీకాంత్ ముందు అంగీకరించలేదట. కూతురు నిజంగానే ధనుష్ ను ప్రేమిస్తోంది అని, ఆయన వీరి పెళ్ళికి ఒప్పుకున్నారు.

ధనుష్ కూడా ముందు నుంచి చాలా సాఫ్ట్. పైగా ఐశ్వర్య కూడా ధనుష్ ను ప్రేమించింది. అందుకే.. రజిని వీరి పెళ్లిని ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్లి అయిన దగ్గర నుంచి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. కాకపోతే.. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ గొడవలు పెరిగి ఇద్దరూ విడిపోయారని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ వీరి విడాకుల విషయంలో చాలా బాధ పడినట్లు తెలుస్తోంది.
Also Read: ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?
[…] Also Read: ఒకే పార్టీలో ధనుష్ – ఐశ్వర్య.. కానీ ప… […]
[…] Bollywood: టుడే బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన పఠాన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఆదిత్య చోప్రా యష్‌రాజ్ ఫిలిమ్స్ బేనర్‌పై నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహామ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. […]
[…] Also Read: ఒకే పార్టీలో ధనుష్ – ఐశ్వర్య.. కానీ ప… […]