Shruti Haasan : కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్, ఏరోజు కూడా సినిమా అవకాశాల కోసం తన తండ్రి పేరుని వాడుకోలేదు. కేవలం తన సొంత టాలెంట్ ద్వారానే అవకాశాలు సంపాదించింది, తన కష్టంతోనే సౌత్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ ప్రారంభం లో ఈమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. ఆ సమయంలో ఆమెకు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోయింది.
అయితే శృతి హాసన్ గురించి ఇండస్ట్రీ లో ఒక కంప్లైంట్ ఉంది. ఈమె షూటింగ్ కి అత్యధిక శాతం తాగేసి వస్తుందని, హీరోలు, దర్శకులు చాలా ఇబ్బంది పడేవారని, ఆమెకు ఉన్న ఈ చెడు అలవాటు కారణంగా అనేక మంది హీరోలు ఈమెతో సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు కాదని, చాలా కాలం నుండి ఒక వార్త ప్రచారం లో ఉంది. ఈ అలవాటు గురించి ఆమె మాట్లాడుతూ ‘నేను చిన్నతనం నుండి దేవుడి ని చాలా గట్టిగా నమ్మేదానిని. మా నాన్నకు అవన్నీ ఇష్టం ఉండేది కాదు. దేవాలయాలకు వెళ్లాలని నాకు కోరిక గా ఉండేది. కానీ మా నాన్న వెళ్ళనించేవాడు కాదు. కానీ నేను ఆయనకి తెలియకుండా చర్చికి వెళ్లేదానిని. దేవుడి మీద నేను పెట్టుకున్న విపరీతమైన భక్తి, నమ్మకం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నాకు 18 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు మా అమ్మానాన్న విబేధాలు వచ్చి విడిపోయారు. అందుకు నేను చాలా బాధపడ్డాను, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలోనే నేను మద్యానికి బానిసని అయ్యాను. మానసికంగా ఎంతో కృంగిపోయాను. నా ఆరోగ్యం కూడా చెడిపోయింది’ అంటూ ఆమె చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. శృతి హాసన్ ఇంత ఓపెన్ గా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం శృతి హాసన్ ‘కూలీ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ముందు ఆమె చేసిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘సలార్’ చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఉంటే చాలు, సినిమా సూపర్ హిట్ అనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది.