Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు రివ్యూస్ చేయడం, ఎదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం, ఇలా తన దినచర్య మొత్తాన్ని పాలనకే కేటాయించాడు. అయితే పాలన సంగతి కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా సగం సగం పూర్తి అయ్యాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒక్కటే షూటింగ్ చివరి దశలో ఉంది. గత కొద్దిరోజుల నుండి షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇచ్చాడు. అయితే తన సినిమాల షూటింగ్స్ గురించి లేటెస్ట్ గా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మంగళగిరి లోని తన క్యాంప్ ఆఫీస్ లో మీడియా తో కాసేపు చిట్ చాట్ చేసిన పవన్ కళ్యాణ్, ఈ వ్యాఖ్యలు చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నిటికీ డేట్స్ ఇచ్చాను. కానీ నిర్మాతలు నా డేట్స్ ని సరిగా ఉపయోగించుకోలేదు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం కేవలం 8 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఒక సినిమా తర్వాత మరొక సినిమాని పూర్తి చేసుకుంటూ వస్తాను’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఓజీ 1980 , 1990 కాలం లో జరిగే గ్యాంగ్ స్టర్ స్టోరీ. దీని కోసం అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. నేను ఏ పబ్లిక్ మీటింగ్ కి వెళ్లినా అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని అరుస్తుంటే, అవి నాకు బెదిరింపులు లాగా వినిపిస్తున్నాయి’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. జనవరి నెలలో ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 21 రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. అనుకున్న ప్రకారం షూటింగ్ ని పూర్తి చేస్తే సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే వచ్చే నెల నుండి పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటనలు కూడా చేయబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల్లో అన్ని జిల్లాలు పర్యటించి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు నేడు ఆయన మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. అదే విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై కూడా ఆయన స్పందించాడు. ప్రమాదం జరిగిన వెంటనే అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఉండుంటే, ఇంత దూరం వచ్చేది కాదని, గోటితో పొయ్యే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు, ఈ విషయం లో అల్లు అర్జున్ ఒక్కడే తప్పు చేసినట్టు చూపించారు, ఇందులో అందరి తప్పు ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.