https://oktelugu.com/

Shruti Haasan: సమంత ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్.. అంత పని చేసిందా?

గత సంవత్సరం బాలయ్య, చిరంజీవిలతో పలకరించిన శృతి రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న, ప్రభాస్ నటించిన సలార్ సినిమాల్లో మెరిసింది. హాయ్ నాన్న లో ఒక సాంగ్ లో కనిపించిన శృతి సలార్ సినిమాలో మెయిన్ రోల్ లో నటించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 25, 2024 / 02:43 PM IST
    Follow us on

    Shruti Haasan: శృతిహాసన్.. ఈ పేరు వినగానే ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు గుర్తు వస్తాయి. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలను ఏలుతున్న బ్యూటీలలో ఈ భామ పేరు ముందు వరుసలో ఉంటుంది. శృతి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకొనిపోతుంది. అంతేకాదు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో మరింత లక్కీ హీరోయిన్ గా మారుతుంది అమ్మడు.

    గత సంవత్సరం బాలయ్య, చిరంజీవిలతో పలకరించిన శృతి రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న, ప్రభాస్ నటించిన సలార్ సినిమాల్లో మెరిసింది. హాయ్ నాన్న లో ఒక సాంగ్ లో కనిపించిన శృతి సలార్ సినిమాలో మెయిన్ రోల్ లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అంతే కాదు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది శృతి హాసన్. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా?

    సమంత నటించాల్సిన ఓ ప్రాజెక్ట్ శృతి వశమైంది. ఎన్. మురారి రచించిన అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ ను ఆధారంగా చేసుకొని మనసుకు హత్తుకునే సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు ఫిలిప్ జాన్. చెన్నై స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇందులో హీరోయిన్ గా సమంతను ఎంచుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్ట్ లో తాజాగా శృతి హాసన్ భాగమయ్యారు. దీనికి నిదర్శనం శృతి హాసన్ చేసిన పోస్ట్ అంటున్నారు. అయితే రీసెంట్ గా డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేసింది ఈ భామ.

    ఆ నగరం వైవిధ్యం, ప్రత్యేకతను చూపించే కథలో భాగమయ్యే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చింది శృతిహాసన్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. ఈ సినిమా ఎలాంటి ముద్ర వేసుకోనుందో చూడాలంటే వేచి ఉండాల్సిందే.