https://oktelugu.com/

ప్రభాస్ తో శ్రుతి హాసన్ రొమాన్స్ !

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రుతి హాసన్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ శ్రుతి హాసన్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 01:44 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రుతి హాసన్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ శ్రుతి హాసన్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ షూట్ జరుగుతుంది. నిజానికి ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఈ సినిమాలో హీరోయిన్ కూడా పాన్ ఇండియా హీరోయిన్ ఉంటుంది అనుకున్నారు.

    Also Read: బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్తూ మీడియాకి దొరికిన మహేష్ హీరోయిన్

    కానీ శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె మెయిన్ హీరోయిన్ కాదు అని, మెయిన్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంటుందని టాక్. ఎలాగూ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ అంటే.. నేషనల్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటేనే ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేస్తున్నారు. సాహోలో శ్రద్ధాకపూర్ తో రొమాన్స్ చేశాడు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్ – ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకోణును హీరోయిన్ గా లాక్ చేశారు. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ఆదిపురుష్ లో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

    Also Read: బాలకృష్ణ, రవితేజల మధ్య మళ్ళీ పోటీ !

    కాగా ఇప్పుడు ఇదే ఊపులో సలార్ కోసం కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ వార్తలు రూమర్స్ అని తేలాయి అనుకోండి. మరి ఏ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారో చూడాలి. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి. ఈ మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్