
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మోస్ట్ లవబుల్ కపుల్ గా ఈ జంట పేరొందింది. ఇటీవలే తల్లిదండ్రులైన వీరు తమ కుమార్తెను మీడియాకు చూపించారు.
సోషల్ మీడియా ద్వారా కూతురును చూపించిన విరుష్క జంట కుమార్తె పేరును కూడా ప్రకటించారు. అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన కుమార్తె పేరును ‘వామిక’గా పెట్టినట్లు తెలిపారు. జనవరిలో తల్లిదండ్రులైన ఈ జంటకు తాజాగా నామకరణం చేశారు.
ఈ ఫొటో వైరల్ అయ్యింది. అనుష్క ఎత్తుకొని నిలబడగా.. కోహ్లీ ఆత్రంగా చూస్తున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘మేము ప్రేమలో కలిసి ఉన్నాము.. మా ప్రేమ.. మరియు విశ్వాసం వామిక రాకతో మరికొత్త రూపం సంతరించుకుంది’ అని అనుష్క పోస్ట్ చేశారు.
మీ కోరికలు, ప్రార్థనలు మాకు మరింత బలాన్ని ఇచ్చాయని.. మాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని విరుష్క తెలిపారు.
ఇక తన కూతురు పేరు ‘వామిక’ అంటే దుర్గామాత’ అని అర్తం అని అనుష్క తెలిపారు. పేరు ప్రకటించకగానే అందరూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.