https://oktelugu.com/

రజనీకాంత్ కోసం ఇరవై కిలోలు తగ్గిందట !

సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ‘ఖుష్బూ’ ఏకంగా ఇరవై కిలోలు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో నటించడానికి తనను తానూ పూర్తగా మార్చుకుందట. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా కాస్త ఫన్నీ వేలో డిజైన్ చేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 01:57 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ‘ఖుష్బూ’ ఏకంగా ఇరవై కిలోలు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో నటించడానికి తనను తానూ పూర్తగా మార్చుకుందట. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా కాస్త ఫన్నీ వేలో డిజైన్ చేశారు. నాకు కొత్తగా అనిపించింది. అందుకే ఇరవై కిలోలు తగ్గాను. ఇక రజిని సర్ నాకు మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాయి’ అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.

    Also Read: ప్రభాస్ తో శ్రుతి హాసన్ రొమాన్స్ !

    కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో ఖుష్బూ రజిని పక్కన ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి. అయితే, రజనీ గత సినిమాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఆ తరహాలోనే కొత్త చిత్రంలో ఖుష్బూతో జోడీ కట్టారు. రజినీతో నటించాకా ఈశ్వరీ రావ్ కి, సిమ్రన్ కి పెద్దగా కలిసి వచ్చింది ఏమి లేదు. మరి ఖుష్బూకి ఎలాంటి రిజల్ట్ వస్తోందో చూడాలి. అయితే రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్.

    Also Read: బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్తూ మీడియాకి దొరికిన మహేష్ హీరోయిన్

    గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు. ఇక రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎలాగూ బరువు తగ్గి ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్ లా తయారయింది కాబట్టి సీనియర్ హీరోలకు ఖుష్బూ రూపంలో ఓ హీరోయిన్ దొరికినట్లే. పైగా రెగ్యులర్ హీరోయిన్ లా నటించడానికి కూడా ఖుష్బూ ఏ మాత్రం మొహమాట పడే మనిషి కాదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.