విశ్వ నటుడు కమల్‌హాసన్ కుమార్తెగా కాకుండా స్టార్ హీరోయిన్ గానే శ్రుతిహాసన్ ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ ఇంట పుట్టిపెరిగిన ఎఫెక్ట్ ఏమో గానీ, ఆమె ఎప్పుడూ ముక్కుసూటితనంతోనే ముందుకు పోతుంది. అందుకే ముందుగా ముక్కుకే సర్జరీ చేయించుకుంది అనుకుంటా. ఏది ఏమైనా శ్రుతి హాసన్ అంటేనే డేర్ అండ్ డాషింగ్ గర్ల్. దీనికితోడు సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో శ్రుతి ఎప్పటికప్పుడు తన భావాలను పంచుకుంటూ ఉంటుంది.
ఇంత ఓపెన్ గా ఉండే శ్రుతి హాసన్ కి ఒక పర్సనల్ సమస్య ఉంది. ఆమె గత కొన్ని రోజులుగా ఒంటరి తనానికి బాగా అలవాటు పడిందట. ఇప్పుడు ఆ ఒంటరి తనమే ఆమెను బాగా ఇబ్బంది పెడుతుంది. పోనీ రిలేషన్ లో ఉందామంటే.. ఆమెతో ప్రేమలో పడిన ప్రియులు ఎక్కువ కాలం ఆమెతో ట్రావెల్ చేయలేక పోతున్నారట. ఆ మధ్య ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ తో ప్రేమలో మునిగితేలిన శ్రుతి, ఆ తరువాత అతనికి దూరం అయింది. అంతకుముందు విదేశీ ప్రియుడితో కూడా ఇదే సమస్య.
ఎందుకో శ్రుతి ఎక్కువ కాలం ఒకరితోనే తన అనుబంధాన్ని కంటిన్యూ చేయలేకపోతుందట. అందుకు కారణం ఎదుటి వాళ్ల క్యారెక్టర్ నచ్చకపోతే, వాళ్ళు ఎంత పెద్ద మనుషులనైనా శ్రుతి హాసన్ అసలు లెక్క చేయదు. అలాగే ఆమె అభిప్రాయాలు ఎప్పటికీ ముక్కుసూటిగానే ఉంటాయి. అలా ఉంటేనే ఆమె మాములుగా మాట్లాడగలుగుతుంది. నిజానికి ఇలాంటి ధోరణి శ్రుతి హాసన్ లో ఎక్కువగా కనిపించడం వల్లే.. కొన్ని సినిమాలకు ఆమె దూరం అయింది.
ఇక తన కెరీర్ లో అవకాశాలు పోయినందుకు గానీ, అలాగే ప్రియుడు దూరం అయినందుకు గానీ ఎప్పుడూ శ్రుతి హాసన్ బాధతో ఏడుస్తూ కూర్చోలేదు. సినీ రంగంలో ఇది సర్వసాధారణమే అనుకుంది. అయినా తనలా ఉన్నత స్థానాల్లో ఉన్న ఆడవాళ్లే ఇలాంటి సమస్యను అనుభవిస్తారని తనకు తానే ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకుంటూ ఉంటుందట.