
సెలబ్రెటీలు ఎంత తొందరగా ప్రేమలో పడుతారో.. అంతే తొందరగా విడిపోతుందటం రోజు చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో హీరోహీరోయిన్లను మార్చినంత ఈజీగా రియల్ లైఫ్ లోనూ ప్రేమికులు మారిపోతుంటారు. అందరూ ఇలా ఉంటారని కాదు.. కొందరు సీన్సియర్ గా ప్రేమించి పెళ్లిపీఠలెక్కిన జంటలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం పెళ్లిపీఠల వరకు రాకుండానే మీడియా ముఖంగా విడిపోతుండటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. చాలామంది తారలు ప్రేమలో విఫలమై.. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించినవారు ఉన్నారు. వీరిలో శృతిహాసన్ మినహాయింపు ఏమీ కాదు. ఈ భామ గతంలో మైఖేల్ క్రోసన్ అనే వ్యక్తితో కొన్నాళ్ల ప్రేమ వ్యవహారం నడిపింది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, ప్రేమ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంది. అయితే ఉన్నట్టుండి వీరిద్దరి విడిపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధమేనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఒకసారి ప్రేమ విఫలమైతే మళ్లీ ప్రేమించకూడదని ఎక్కడా ఉందా అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం తాను ప్రేమలో పడే వయస్సులోనే ఉన్నానని అంటోంది. గొప్ప ప్రేమ దొరికితే తాను ప్రేమించేందుకు సిద్ధమంటూ ప్రకటించేసింది. ప్రేమ అనేది గమ్మత్తయిన అనుభవమని శృతిహాసన్ అంటోంది. తాను ప్రేమలో విఫలమైనందుకు ఎప్పుడు బాధపడలేదని.. అది తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని శృతిహాసన్ స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే శృతిహాసన్ ప్రేమలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసేందుకు రెడీగా ఉందని అర్థమవుతోంది. శృతిహాసన్ కోరుకుంటున్నట్లుగా ఆమెకు గొప్ప ప్రేమ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే శృతిహాసన్ ను ప్రేమలో దించే ఆ లక్కీ ఫెల్లో ఎవరా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.