https://oktelugu.com/

వామ్మో.. పాయల్ స్పీడు చూశారా.!

దేశంలో లాక్డౌన్ కారణంగా ప్రతీఒక్కరూ ఇంటికే పరిమితయ్యారు. ఎప్పుడూ బీజీగా ఉంటే సెలబెట్రీలు మాత్రం లాక్డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హీరోహీరోయిన్లు తమలోని కొత్త టాలెంట్ ను బయటికి తెస్తున్నారు. కొందరు కిచెన్లో కొత్తకొత్త వంట ప్రయోగాలు చేస్తుండగా మరికొందరు ఫిటెనెస్, యోగాపై దృష్టిసారిస్తున్నారు. ఆన్ లైన్ కోర్సులు, కొత్తకొత్త ఛాలెంజ్ లు, హాట్ హాట్ ఫొటోల ముచ్చట్లతో సెలబ్రెటీలు నిత్యం అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 17, 2020 / 02:45 PM IST
    Follow us on


    దేశంలో లాక్డౌన్ కారణంగా ప్రతీఒక్కరూ ఇంటికే పరిమితయ్యారు. ఎప్పుడూ బీజీగా ఉంటే సెలబెట్రీలు మాత్రం లాక్డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హీరోహీరోయిన్లు తమలోని కొత్త టాలెంట్ ను బయటికి తెస్తున్నారు. కొందరు కిచెన్లో కొత్తకొత్త వంట ప్రయోగాలు చేస్తుండగా మరికొందరు ఫిటెనెస్, యోగాపై దృష్టిసారిస్తున్నారు. ఆన్ లైన్ కోర్సులు, కొత్తకొత్త ఛాలెంజ్ లు, హాట్ హాట్ ఫొటోల ముచ్చట్లతో సెలబ్రెటీలు నిత్యం అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు.

    ‘ఆర్ఎక్స్-100’ మూవీతో పాయల్ రాజ్ ఫుత్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ మూవీ హిట్టుతో ఈ భామకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పాయల్ రాజ్ ఫుత్ సోషల్ మీడియాలో మాత్రం యమయాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తోంది. ఇటీవల పిల్లో ఛాలెంజ్లో భాగంగా పిల్లో చాటున అందాలను ఆరబోసి అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది పాయల్ రాజ్ ఫుత్. సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ తో అలరిస్తూనే మరోవైపు షార్ట్ ఫిల్మ్ లో నటిస్తోంది.

    లాక్డౌన్ సమయంలోనూ ‘ది రైటర్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి పాయల్ జోరు చూపించింది. ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం 24గంటల్లోనే చిత్రీకరించారు. దర్శకుడు సౌరభ్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ అన్ని భాషల్లో విడుదల కానుందట. ఒక్కరోజునే షార్ట్ ఫిల్మ్ పూర్తి చేయడంపై హీరోయిన్ పాయల్, దర్శకుడు సౌరభ్ ను పలువురు అభినందిస్తున్నారు. పాయల్ రాజ్ ఫుత్ ఇటీవల ‘వెంకీమామ’తో అభిమానుల ముందుకొచ్చి సందడి చేసింది. ప్రస్తుతం ఓ లేడి ఓరియంటేడ్ మూవీలో నటిస్తోంది. కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ ప్రస్తుతం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తుండటం గమనార్హం.