https://oktelugu.com/

Shruti Haasan: నిద్ర పోకుండా తెల్లార్లు ఫోన్లో అలాంటి పనులు… శృతి హాసన్ బండారం బట్టబయలు!

Shruti Haasan: ప్రస్తుతం అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో థ్రిల్లర్ చేస్తుంది. ఈ మూవీ టైటిల్ ప్రోమో ఆసక్తి రేపింది. అలాగే సలార్ 2లో శృతి హాసన్ నటించాల్సి ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 19, 2024 / 12:50 PM IST

    Shruti Haasan not sleeping in night and addicted to mobile

    Follow us on

    Shruti Haasan: శృతి హాసన కి నిద్రపట్టడం లేదట. ప్రపంచం అంతా నిద్రపోతుంటే తెల్లవారుజాము 3 గంటలకు మొబైల్ లో అవి చూస్తుందట. ఆ కహాని ఏమిటో చూద్దాం. హీరోయిన్స్ లో శృతి హాసన్ తీరే వేరు. ఎఫైర్స్, డేటింగ్స్ విషయంలో పెద్దగా దాపరికాలు ఉండవు. ప్రేమ కోసం కెరీర్ ని కూడా వదిలేసింది అమ్మడు. లండన్ ప్రియుడు మైఖేల్ కోసం 2017 తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. అప్పుడు శృతి హాసన్ కెరీర్ పీక్స్ లో ఉంది. 2019 లో మైఖేల్ బ్రేకప్ చెప్పడంతో తిరిగి సినిమాలు చేసింది. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసింది.

    ప్రస్తుతం అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో థ్రిల్లర్ చేస్తుంది. ఈ మూవీ టైటిల్ ప్రోమో ఆసక్తి రేపింది. అలాగే సలార్ 2లో శృతి హాసన్ నటించాల్సి ఉంది. ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో స్పష్టత లేదు. కాగా ఇటీవల కొత్త ప్రియుడికి కూడా శృతి హాసన్ గుడ్ బై చెప్పింది. రెండేళ్లకు పైగా శృతి హాసన్ ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో జీవించారు.

    Also Read: Breaking News: చిరంజీవి మాజీ అల్లుడు మృతి… తండ్రిని కోల్పోయిన శ్రీజ కూతురు!

    శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలు శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేది. త్వరలో పెళ్లి అనుకుంటుండగా అతనితో విడిపోయింది. ఇంస్టాగ్రామ్ నుండి శాంతనుతో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసి హింట్ ఇచ్చింది. సోషల్ మీడియా చాట్ లో తాను ఇంకా సింగిల్ అని నేరుగా చెప్పింది. ప్రస్తుతం శృతి హాసన్ ఒంటరి అని చెప్పాలి. ఈ క్రమంలో ఆమెకు నిద్రపట్టడం లేదట. ఈ మేరకు ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.

    Also Read: Akhil: ఏ వారసుడికి జరగని ఘోర అవమానం అఖిల్ కే జరుగుతుందా..? ఎందుకిలా అవుతుంది..?

    సాధారణ జనాలు అందరూ నిద్ర పోతుంటే తెల్లవారుజామున 3 గంటల వరకు మెలకువతో ఉన్న శృతి హాసన్ ఫోన్లో మీమ్స్ చూస్తుందట. సదరు మీమ్స్ ఫ్రెండ్స్ కి పంపుతుందట. ఈ విషయాన్ని శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. శృతి హాసన్ పోస్ట్ చూసిన జనాలు ఆమె మొబైల్ కి అడిక్ట్ అయ్యారనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి బెడ్ పై ఫోన్ చూస్తూ నిద్రపోవడం జనాలకు అలవాటుగా మారింది. కొదరైతే మొబైల్ చూస్తూ నిద్రను కూడా వదిలేస్తున్నారు.