Breaking News: చిరంజీవి మాజీ అల్లుడు మృతి… తండ్రిని కోల్పోయిన శ్రీజ కూతురు!

Breaking News: అప్పట్లో శ్రీజ ప్రేమ వివాహం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. శ్రీజ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని కేసు పెట్టింది. కొన్నాళ్ళు శ్రీజ-శిరీష్ ల వైవాహిక బంధం సవ్యంగా సాగింది.

Written By: S Reddy, Updated On : June 19, 2024 12:30 pm

Sreeja Ex Husband Sirish Bharadwaj Dies

Follow us on

Breaking News: టాలీవుడ్ లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు అకాల మరణం పొందాడు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త నేడు మరణించినట్లు సమాచారం అందుతుంది. 2007లో శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన క్లాస్ మేట్ అయిన శిరీష్ భరద్వాజ్ తో శ్రీజ ఏడడుగులు వేసింది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో శిరీష్-శ్రీజల వివాహం జరిగింది.

అప్పట్లో శ్రీజ ప్రేమ వివాహం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. శ్రీజ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని కేసు పెట్టింది. కొన్నాళ్ళు శ్రీజ-శిరీష్ ల వైవాహిక బంధం సవ్యంగా సాగింది. వీరికి సంతానంగా ఒక అమ్మాయి పుట్టింది. పేరు నివ్రతి. కూతురు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. శ్రీజ తన భర్త శిరీష్ మీద ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని… శిరీష్, అతని కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసింది.

శిరీష్ తో విడాకులు తీసుకున్న శ్రీజ కూతురితో పాటు తండ్రి వద్దకు చేరింది. 2016 లో కళ్యాణ్ దేవ్ అనే మరొక వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. మరోవైపు శిరీష్ సైతం రెండో వివాహం చేసుకున్నాడు. ఓ డాక్టర్ తో శిరీష్ కి వివాహం జరిగినట్లు సమాచారం.

కాగా శిరీష్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఉంచారు. నేడు ఉదయం శిరీష్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. దాంతో చికిత్స పొందుతూ శిరీష్ కన్నుమూశాడు. కాగా శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో కూడా విడిపోయిన సంగతి తెలిసిందే..