Jagan: ప్రజాస్వామ్యం ఓడిపోయాక గుర్తొచ్చింది

ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించేవారే ప్రజాస్వామ్య దేశంలో విజయం సాధిస్తారు.

Written By: Raj Shekar, Updated On : June 19, 2024 12:54 pm

Jagan

Follow us on

Jagan: ధర్మో రక్షతి రక్షితః.. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనలను రక్షిస్తుంది. ఇదే విధంగా అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యన్ని కూడా మనం రక్షిస్తే.. ప్రజాస్వామ్యం కూడా పాలకులను రక్షిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం.. అందుకే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మూడు విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి జగన్‌ను ఉపేక్షించలేదు. దీంతో 2019లో ప్రజాస్వామ్యం చేతిలో ఓడిపోయారు. జగన్‌ సారథ్యంలోని వైసీపీని గెలిపించింది. ఇక 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్‌ కూడా ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోలేదు. దీంతో అదే ప్రజాస్వామ్యం చేతిలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే జరుగుతుంది.

తెలంగాణలో కేసీఆర్‌..
ఇక తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజస్వామ్యం పదేళ్లు అధికారంలో కూర్చోబోట్టింది. కానీ, మొదటి విడత కన్నా రెండో విడతలో కేసీఆర్‌ సర్కార్‌ ప్రజాస్వామాన్ని అపహాస్యం చేసింది. ప్రతిపక్షాలను నిర్వీరయం చేయాలని చూశారు. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కూడా ప్రజాస్వామ్యం గద్దె దించింది.

పవర్‌ ఆఫ్‌ డెమొక్రసీ..
ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించేవారే ప్రజాస్వామ్య దేశంలో విజయం సాధిస్తారు. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. లేదంటే ఎంతటి మహా మహులైనా ప్రజాస్వామ్యానికి తల వంచాల్సిందే. ఇక్కడ ఆసక్తి కర విషయం ఏమిటంటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోని నేతలు.. పవర్‌పోగానే ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు అంటూ శరణు కోరుతున్నారు. ఇందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్‌ నిదర్శనం. ఓటమి తర్వాత ప్రజాస్వామ్యమా మమ్మల్ని కాపాడు అంటూ డెమొక్రసీ పవర్‌ను వేడుకుంటున్నారు.

జగన్‌ ఆసక్తికర ట్వీట్‌
2019లో అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన జగన్‌ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాడు. దీంతో జగన్‌కు ఇప్పడు సడెన్‌గా ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ‘‘న్యాయం అందుతుందని అనుకోవడం కాదు. అది అందిన్నట్లు కనిపడాలి కూడా. ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడమే కాదు. అది ప్రత్యక్షంగా కనిపించాలి కూడా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎన్నికల ప్రక్రియకు పేపర్‌ బ్యాలట్స్‌ మాత్రమే వాడుతున్నాయి. ఈవీఎంలు కాదు. కనుక మనం కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకునేందుకు మళ్లీ పేపర్‌ బ్యాలట్స్‌ ప్రక్రియకు మారడం చాలా మంచిది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేయడం గమనార్హం. ఓటమికి తన అసమర్ధత, అవినీతి, అరాచకాలు, అనాలోచిత నిర్ణయాలు కారణాలు కావని, టీడీపీ, జనసేన, బీజేపీలు ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశాయని పరోక్షంగా వెల్లడించారు.

గెలిస్తే రైట్‌.. ఓడితే రాంగ్‌..
తాము ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పిన జగన్‌.. ఇప్పుడు 11 సీట్లు గెలిచాక ప్రజాస్వామ్యం ఓడిందనడమే హాస్యాస్పదం.. రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, తమకు కూడా జగన్‌ హానికరమని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావించబట్టే చిత్తుగా ఓడిపోయారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని, లోపాలు సరిదిద్దుకొన్నవారినే ప్రజలు ఆదరిస్తారు. ఇందుకు నిదర్శనం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌. అహంకారంతో విర్రవీగితే ప్రజలు క్షమించరనడానికి కేసీఆర్, జగనే నిదర్శనం.