Akhil: ఏ వారసుడికి జరగని ఘోర అవమానం అఖిల్ కే జరుగుతుందా..? ఎందుకిలా అవుతుంది..?

Akhil: ఆయన ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక సక్సెస్ కూడా కొట్టకపోవడం అనేది అక్కినేని అభిమానులతో పాటు నాగార్జునని కూడా తీవ్రంగా వేధిస్తున్న విషయమనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : June 19, 2024 12:18 pm

Akkineni Akhil will be humiliated

Follow us on

Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు మంచి సక్సెస్ లను అందుకుంటున్న క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ మాత్రం ఇప్పటివరకు సరైన సక్సెస్ ఒక్కటి కూడా కొట్టలేదు. ఇక ఆయన చేసిన 5 సినిమాల్లో 5 సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడం విశేషం.. ఇక అందులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ సినిమా కొంతవరకు ఓకే అనిపించుకున్నప్పటికీ ఒక భారీ సక్సెస్ అయితే దక్కడం లేదు.

ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక సక్సెస్ కూడా కొట్టకపోవడం అనేది అక్కినేని అభిమానులతో పాటు నాగార్జునని కూడా తీవ్రంగా వేధిస్తున్న విషయమనే చెప్పాలి. ఏ వారసుడి కెరియర్ లో కూడా ఇలాంటి ఒక బ్యాడ్ రికార్డు అయితే లేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరొక దర్శకుడితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాని కోసమే ఆయన ఆ సినిమా మేకోవర్ లో ఆయన చాలా బిజీగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన అఖిల్ పొడగాటి జుట్టుతో భారీ గడ్డంతో ఒక కొత్త లుక్ లో కనిపించాడు.

Also Read: Kalki 2898 AD: కల్కి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది..మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి..?

ఇక అతన్ని చూసిన అక్కినేని అభిమానులు ఈ సినిమాతో నైనా సక్సెస్ కొడతాడా లేదా అనే అనుమానాలనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే అక్కినేని మూడోవ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లడంలో అఖిల్ చాలా వరకు వెనుకబడ్డాడు. ఇక నాగచైతన్య ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అఖిల్ మాత్రం చాలా వరకు డీలా పడిపోయాడనే చెప్పాలి.

Also Read: Sai Pallavi: బెస్ట్ డాన్సర్ సాయి పల్లవి ట్రై చేసిన చిరంజీవి స్టెప్ ఏమిటో తెలుసా? ఆ మూమెంట్ అంటే మహా ఇష్టం అట!

ఇక ఆయన సినిమాలా విషయంలో ఏం జరిగిందంటే ఆయన ఇండస్ట్రీకి రాకముందే ఆయనను స్టార్ హీరోగా పోట్రే చేసే ప్రయత్నం చేశారు. దాని వల్లే ఆయన నార్మల్ సినిమాలను చేయకుండా తనను తాను స్టార్ హీరోగా ఊహించుకొని భారీ సినిమాలను చేసే ప్రయత్నం చేశాడు. అందువల్లే ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని కొంత మంది సినీ పండితులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…