‘శృతి హాసన్’ (Shruti Haasan) చాలా బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం శృతికి మేకప్ తోనే అబ్బింది. పైగా మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదనేది ఎపుడూ శృతి చెప్పే మాట. ఇక శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది.
కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘శృతి హాసన్’ మాట్లాడుతూ.. మ్యూజిక్ మీద ఆసక్తితోనే నేను సినిమాల్లోకి వచ్చాను’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శృతి మాటల్లోనే.. ‘నాకు సంగీతం అంటే ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు రాక్ స్టార్ అవ్వాలనే కోరిక ఉండేది. నేను రాక్ స్టార్ అయిపోయినట్టు కలలు కనేదాన్ని. నా సన్నిహితులకు కూడా తెలియదు.
నేను ఆ సమయంలో ఒక రాక్ బ్యాండ్ నడపాలి అనుకున్నాను. కాకపోతే బ్యాండ్ నడిపే అంత నా దగ్గర అప్పుడు లేదు. పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే రెండు, మూడు సినిమాలు చేసి ఆ డబ్బుతో బ్యాండ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ దశలో ఇక సినిమాలకు కూడా గుడ్ బై చెబుదామని అనుకున్నాను.
అయితే, పరిస్థితులు మారాయి. అలాగే నా ఆలోచనలు కూడా. నాకు తెలియకుండానే నేను సినిమాలను ఇష్టపడ్డాను. మెల్లిగా నటన పై ప్రేమను పెంచుకున్నాను. చివరకు సినిమానే నా ప్రపంచం అయిపోయింది’ అని శృతి హాసన్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఎలాంటి వ్యవహారం గురించి అయినా శృతి హాసన్ లా స్పందించే మరో హీరోయిన్ ఈ జనరేషన్ లో బహు అరుదు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More