Homeఎంటర్టైన్మెంట్Shriya Saran as Prabhas mother: ప్రభాస్ కి తల్లిగా శ్రియా శరణ్.. ఇదేమి విచిత్రం...

Shriya Saran as Prabhas mother: ప్రభాస్ కి తల్లిగా శ్రియా శరణ్.. ఇదేమి విచిత్రం సామీ!

Shriya Saran as Prabhas mother: మన చిన్నతనం లో బాగా ఇష్టపడిన హీరోయిన్స్ లో ఒకరు శ్రియా శరణ్(Shriya Saran). నిన్నటి తరం సూపర్ స్టార్స్ అయినటువంటి చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ(Nandamuri Balakrishna), నాగార్జున(Akkineni Nagarjuna), వెంకటేష్(Victory Venkatesh) వంటి స్టార్ హీరోలతోనే కాకుండా, నేటి తరం సూపర్ స్టార్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu), ఎన్టీఆర్,ప్రభాస్(Rebel Star Prabhas) వంటి హీరోల సరసన కూడా ఈమె హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా కొంతకాలం కొనసాగింది. కానీ ఏ హీరోయిన్ కి అయినా ఒక వయస్సు వచ్చిన తర్వాత హీరోయిన్ రోల్స్ తగ్గిపోతాయి. క్యారక్టర్ రోల్స్ కి పరిమితం అవుతుంటారు. శ్రీయ తో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన త్రిష,నయనతార వంటి హీరోయిన్లు ఇప్పటికీ స్టార్ హీరోయిన్స్ గానే కొనసాగుతున్నారు కానీ, శ్రీయ మాత్రం ఇప్పుడు క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యింది. రీసెంట్ గానే ఈమె తేజ సజ్జ ‘మిరాయ్’ చిత్రంలో హీరో తల్లి క్యారక్టర్ పోషించింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించిన హీరోయిన్ ని ఇలా తల్లి క్యారక్టర్స్ లో చూడడం ఆమె అభిమానులకు అసలు నచ్చడం లేదు. తేజ సజ్జ వంటి హీరోలకు తల్లి క్యారక్టర్ చేసినా పర్వాలేదు, కానీ ఆమె గతం లో ఏ హీరోల సరసన అయితే హీరోయిన్ గా నటించిందో, ఇప్పుడు అదే హీరోలకు తల్లి పాత్రలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో ప్రభాస్ చిన్నప్పటి క్యారక్టర్ కి తల్లి పాత్రలో శ్రీయా శరన్ నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. గతం లో ఆమె ప్రభాస్ ‘ఛత్రపతి’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అదే హీరో సినిమాలో ప్రభాస్ కి తల్లి క్యారక్టర్ చేస్తుంది.

#RRR లో కూడా ఈమె రామ్ చరణ్ కి తల్లి క్యారక్టర్ లో కనిపించింది. రామ్ చరణ్ తో గతం లో ఈమె ఎలాంటి సినిమా చేయలేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘నా అల్లుడు’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. రామ్ చరణ్ కి తల్లి క్యారక్టర్ చేసిందంటే, వరుసకు ఎన్టీఆర్ కి కూడా తల్లి క్యారక్టర్ చేసినట్టే కదా. శ్రీయా కెరీర్ చివరికి ఇలాంటి మలుపు తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. పెళ్లి అయ్యినప్పటి నుండి ఆమె క్రేజ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇంతకు ముందు చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున వంటి సీనియర్ హీరోలు అవకాశం ఇచ్చేవారు కానీ, ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. దీంతో శ్రీయా ఇప్పుడు ఎలాంటి క్యారక్టర్ చేయడానికి అయినా సిద్ధం అయిపోతుంది. మరి ఆడియన్స్ ఆమెని ప్రభాస్ కి తల్లిగా అంగీకరిస్తారో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version