Nara Brahmani fires on Thaman: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie). బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం లో గతం లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత బాలయ్య కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఫ్లాప్ అనేది చూడలేదు. అలాంటి సెన్సేషనల్ సెకండ్ ఇన్నింగ్స్ అందించిన ‘అఖండ’ కి సీక్వెల్ కార్యరూపం దాల్చగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూసారు ఆడియన్స్. అన్ని అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ సినిమా ఈ నెల దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా వేస్తున్నట్టు రీసెంట్ గానే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
అయితే రీసెంట్ గానే బాలయ్య బాబు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ లో హీరో గా కెరీర్ ని పూర్తి చేసుకున్నందుకు గానూ, ఆయన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్) లోకి ఎక్కించారు. మొన్న రాత్రి ఆయనకు ఈ అవార్డుని అందించారు. ఈ ఈవెంట్ కి బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు, సంగీత దర్శకుడు తమన్ కూడా విచ్చేశాడు. ఈ సందర్భంగా బాలయ్య పెద్ద కూతురు, నారా లోకేష్ సతీమణి, నారా బ్రాహ్మణి తో తమన్ కి ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ‘మీ వల్లనే అంట కదా..సినిమా వాయిదా పడింది. మూవీ టీం మొత్తం మీ పేరే చెప్పారు’ అని అంటుంది. అప్పుడు తమన్ నవ్వుతూ ‘లేదు మేడం..ఎవరో మీకు తప్పు సమాచారం వచ్చింది’ అంటూ ఆ చిత్ర నిర్మాత, బాలయ్య రెండవ కూతురు తేజస్విని వైపు చూస్తాడు. అప్పుడు తేజస్విని ‘మేమెవ్వరం చెప్పలేదు..మా అక్క మిమ్మల్ని సరదాగా ఆటపట్టిస్తుంది’ అను చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ఫన్నీ సంభాషణ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇదంతా పక్కన పెడితే ఈ ‘అఖండ 2’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘అఖండ’ చిత్రం కూడా 2021 వ సంవత్సరం, డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాని కూడా డిసెంబర్ 5న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు మేకర్స్. డిసెంబర్ 5 న ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ చిత్రాన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. కాబట్టి ‘అఖండ 2’ కి లైన్ పూర్తిగా క్లియర్ అయ్యినట్టే. చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి అఖండ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది.
Entha cute ga aduguthunshi this is too unfair anta ❤️
Mve Mee Valle postpone anta kada
— రాG OG gadi pilla❣️ (@RGNithya_pspk) August 31, 2025