Bigg Boss 9 Telugu: ఈ సీజన్(Bigg Boss 9 Telugu) మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో శ్రేష్టి వర్మ కి అతి తక్కువ ఓట్లు రావడం తో ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ నుండి వెళ్లే ముందు ఆమె నాగార్జున ఇచ్చిన ఒక చిన్న టాస్కు ని ఆడింది. కెమెరాల ముందు హౌస్ లో నటిస్తున్న వాళ్ళు ఎవరు, నిజాయితీగా ఉన్నవాళ్లు ఎవరో చెప్పమంటాడు నాగార్జున. అప్పుడు ఆమె కెమెరాల ముందు నటించే వాళ్ళు రీతూ చౌదరి,తనూజ మరియు భరణి పేర్లు చెప్తుంది. ఎందుకంటే సంజన గుడ్డు దొంగతనం చేసినప్పుడు వీళ్లిద్దరి దగ్గరకు వెళ్లి ఆమె దొంగతనం చేసిందా లేదా అని అడిగిందట. అప్పుడు వాళ్లిద్దరూ చెయ్యలేదని అబద్దం చెప్పారు. ఆ తర్వాత గుడ్డు దొంగతనం జరిగింది అనే విషయం వాళ్ళిద్దరికీ తెలిసినట్టు ఈమెకు తెలుస్తుంది. అందుకు ఈమె బాగా బాధపడింది అట.
ఇద్దరినీ ఎంతో నమ్మాను, కానీ ఆ నమ్మకాన్ని వాళ్లిద్దరూ నిలబెట్టుకోలేకపోయారు అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా భరణి ని నాకు అన్నయ్య లాగా భావించాను, కానీ ఆయన నా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు అంటూ స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకుంది శ్రేష్టి వర్మ. ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే ఈమె మన దగ్గర ఒకలాగా, వేరే వాళ్ళ దగ్గర మరోలాగా ప్రవర్తిస్తుంది, ఈమె ఫేక్ అంటూ చెప్పుకుంది. ఇది విన్న తర్వాత రీతూ చౌదరి కూడా షాక్ కి గురైంది. ఎందుకంటే ఆమెకు ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడే అలవాటు ఉందని హౌస్ లో ఉన్నవాళ్ళు ఎక్కువగా నమ్ముతుంటారు. ఇన్ని రోజులు ఆమె ప్రవర్తన కూడా అదే విధంగా ఉండేది. అలాంటిది ఆమె ఫేక్ అని చెప్పడం కాస్త షాక్ కి గురి అయ్యింది. అదే నామినేషన్స్ అయ్యుంటే పెద్దగా వాదించి ఉండేదేమో కానీ, నామినేషన్స్ కాదు కాబట్టి, ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి,ఇక ఎందుకు కొట్లాడడం అనే ఉద్దేశ్యం తో ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
ఇక నిజాయితీగా ఉండే కంటెస్టెంట్స్ గా మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్,రాము రాథోడ్ మరియు ఫ్లోరా షైనీ పేర్లను పెట్టింది. మంచి కంటెస్టెంట్స్ ని పెట్టింది కానీ, మర్యాద మనీష్ ఆమెకు ఏ విధంగా నిజాయితీగా అనిపించాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక్క యాపిల్ ని అడిగితేనే ఇవ్వలేదు, వేరే కంటెస్టెంట్స్ కి అయితే స్వయంగా తన చేతుల మీదుగానే ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎలిమినేషన్ అయిపోయిన వెంటనే ఆమె శివాజీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 9 బజ్’ ప్రోగ్రాం లో పాల్గొన్నది. అక్కడ కూడా ఆమె దాదాపుగా ఇవే మాటలు మాట్లాడింది.