Bigg Boss 9 Telugu nominations : బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూసే ఎపిసోడ్ సోమవారం ప్రసారమయ్యే నామినేషన్స్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. వారం మొత్తం జరిగే సంఘటనల ఆధారంగా కంటెస్టెంట్స్ వాదించుకుంటూ ఒకరిపై ఒకరు హౌస్ నుండి బయటకు పంపేందుకు నిర్వహించే ఈ ప్రక్రియ లో గొడవలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ ఎపిసోడ్ కోసం అందరూ అంతలా ఎదురు చూస్తూ ఉంటారు. మొదటి వారం జరిగిన నామినేషన్స్ లో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందరూ ఫ్లోరా షైనీ లేదా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు కానీ, శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇక రెండవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందట. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, భరణి శంకర్, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, మర్యాద మనీష్ అట. రీతూ చౌదరి వచ్చి భరణి, ఫ్లోరా షైనీ ని నామినేట్ చేయగా, రాము పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసాడట. అదే విధంగా మర్యాద మనీష్ వచ్చి రీతూ చౌదరి , భరణి ని నామినేట్ చేయగా, డిమోన్ పవన్ వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరా షైనీ ని నామినేట్ చేసాడు. ఇక సుమన్ శెట్టి అయితే ప్రియా మరియు మనీష్ ని నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే మాస్క్ మ్యాన్ హరీష్ కి అత్యధిక నామినేషన్స్ పడుతాయని అనుకుంటే మనీష్ కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి అట. బహుశా ఆయన సంచాలక్ గా ఆయన విఫలం అయ్యినందుకు హౌస్ మొత్తం ఆయన్ని నామినేషన్స్ లో పెట్టడానికి కారణం అయ్యుండొచ్చు.
ఇకపోతే వీరిలో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాస్క్ మ్యాన్ హరీష్ మరియు ఫ్లోరా షైనీ అని అనుకోవచ్చు. వీళ్లిద్దరిలో మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను మాట్లాడే బలుపు మాటలు ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఎప్పుడెప్పుడు నామినేషన్స్ లోకి వస్తాడా?, ఎప్పుడెప్పుడు బయటకు పంపేద్దామా అనేంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మొన్న ఆయన నాగార్జున తో మాట్లాడిన పద్దతి ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఇంత పొగరు,బలుపు అతనిలో ఏమి చూసుకొని వచ్చిందో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా ఫ్లోరా షైనీ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.