https://oktelugu.com/

Shraddha Kapoor : డేటింగ్ ఒకరితో.. పెళ్లి మరొకరితో..అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన ‘స్త్రీ2’ హీరోయిన్ శ్రద్దా కపూర్!

ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమె చాలా కాలం నుండి రాహుల్ మోడీ అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేస్తుంది. రాహుల్ మోడీ పేరు చాలా విచిత్రం గా ఉంది కదూ..

Written By:
  • Vicky
  • , Updated On : October 17, 2024 / 09:30 PM IST

    Shraddha Kapoor

    Follow us on

    Shraddha Kapoor : బాలీవుడ్ ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రద్దా కపూర్ కెరీర్ ప్రారంభం లో అద్భుతమైన పాత్రలతో నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఆ తర్వాత నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. కేవలం కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా ఈమె కనిపించేది. రీసెంట్ గా ఈమె ప్రధాన పాత్రలో కనిపించిన ‘స్త్రీ 2’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

    900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన మొట్టమొదటి ప్రాంతీయ బాషా చిత్రం గా ‘స్త్రీ2’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. రీసెంట్ గానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. అయినప్పటికీ కూడా పలు థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తూనే ఉంది. ఈ సినిమా తర్వాత శ్రద్ద కపూర్ క్రేజ్ సూపర్ స్టార్స్ తో సమానంగా మారింది. ఇదంతా పక్కన పెడితే శ్రద్దా కపూర్ గురించి తెలిసిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమె చాలా కాలం నుండి రాహుల్ మోడీ అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేస్తుంది. రాహుల్ మోడీ పేరు చాలా విచిత్రం గా ఉంది కదూ?, దేశం లో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పేరులో రాహుల్ ని, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు లో మోడీని జత చేస్తే రాహుల్ మోడీ అనే పేరు వస్తుంది. ఇతనితో కలిసి శ్రద్దా కపూర్ చెట్టాపట్టాలేసుకొని తిరిగేది, తన ఇంస్టాగ్రామ్ లో ఈయనతో కలిసి ఎన్నో ఫోటోలు దిగి అప్లోడ్ చేసేది. అయితే ఈమె రీసెంట్ గానే రాహుల్ మోడీ కి బ్రేకప్ చెప్పినట్టు సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త.

    కారణం ఈమె అతి త్వరలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ లో ఒక రూమర్ వినిపిస్తుంది. రీసెంట్ గానే ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నేను ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డాను. అతనితో డేటింగ్ చేస్తున్న సమయంలో నాకు ఎంతో ఆనందం కలిగింది. మేమిద్దరం కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్తున్నాము. అతనితో నా జీవితం ఎంతో అందంగా అనిపిస్తుంది కానీ, పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం ఇప్పట్లో లేదు. ప్రస్తుతం నా ద్రుష్టి మొత్తం కెరీర్ పైన మాత్రమే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది శ్రద్దా కపూర్. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరు? అని సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ట్యాగ్ చేసి అడుగుతున్నారు.