Game changer Movie : గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ పై షాకింగ్ ట్విస్ట్..కొడుకు కోసం తండ్రి తగ్గబోతున్నాడా?

ఈ చిత్రాన్ని దిల్ రాజు కి బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచన లో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం శంకర్ తో ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం జనవరి 10 న విడుదల అవ్వబోతున్నట్టు మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాలి.

Written By: Vicky, Updated On : September 14, 2024 3:24 pm

Game Changer Movie

Follow us on

Game changer Movie :  సంక్రాంతి సీజన్ తర్వాత స్తబ్దుగా ఉన్న టాలీవుడ్, మళ్ళీ స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడబోతుంది. ఈ నెల 27 వ తారీఖున ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా పై అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ నుండి సోలో సినిమా విడుదలై దాదాపుగా ఆరేళ్ళు అవ్వడంతో, ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, కానీ రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినప్పటికీ, ఈ సినిమాపై జనాల్లో ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. ఈ చిత్రం తర్వాత డిసెంబర్ 6 వ తేదీన అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ చిత్రం, అలాగే అదే నెల లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కాబోతుంది. మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ డేట్ ఖరారు చెయ్యలేదు. డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేస్తారని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది.

కానీ అదే రోజున రెండు హాలీవుడ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి సిటీస్ లో షోస్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంది. అలాగే ఓవర్సీస్ లో కూడా భారీ గా షోస్ కొరత ఉండొచ్చు. అందుకే ఈ చిత్రాన్ని దిల్ రాజు కి బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచన లో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం శంకర్ తో ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం జనవరి 10 న విడుదల అవ్వబోతున్నట్టు మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాలి. విశ్వంభర చిత్రం కేవలం టాలీవుడ్ కి సంబంధించిన సినిమా, కానీ గేమ్ చేంజర్ చిత్రం పాన్ ఇండియన్ సినిమా, సుమారుగా 300 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేసారు. అది మొత్తం రికవర్ అవ్వాలంటే కచ్చితంగా సంక్రాంతి లాంటి సీజన్ కావాలి.

మేకర్స్ అడగడం లో న్యాయం ఉంది, మరి విశ్వంభర మేకర్స్ అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. చిరంజీవి రామ్ చరణ్ తండ్రి కాబట్టి, ఆయన కలగచేసుకొని మేకర్స్ తో మాట్లాడితే కచ్చితంగా విశ్వంభర చిత్రం సంక్రాంతి రేస్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. గతం లో కూడా చిరంజీవి #RRR చిత్రం కోసం ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ కి వాయిదా వేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చూడాలి మరి ‘గేమ్ చేంజర్’ సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ నెలలో ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాట ని విడుదల చేయబోతున్నారు.