https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవికి పిల్లను ఇవ్వాలా వద్దా? అల్లు రామలింగయ్య ఎవరి దగ్గరకు వెళ్ళాడో తెలుసా?

చిరంజీవిని అల్లు రామలింగయ్య అల్లుడిని చేసుకోవడం వెనుక పెద్ద కథే నడించిందట. అదే సమయంలో సురేఖకు కలెక్టర్ సంబంధం రావడంతో అల్లు రామలింగయ్య సందిగ్ధంలో పడ్డారట. చిరంజీవి-సురేఖ పెళ్లి పీటలు ఎక్కడానికి ఓ వ్యక్తి కారణం అయ్యారట. ఆ కథేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : September 14, 2024 / 03:33 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi :  సినిమా నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన చిరంజీవి నటుడు కావాలనే ఆశతో చెన్నై వెళ్ళాడు. అక్కడ యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. నటనలో శిక్షణ తీసుకుంటూనే ప్రయత్నాలు చేశాడు. పునాది రాళ్లు చిత్రంలో ఆయనకు అవకాశం వచ్చింది. మొదటిసారి పునాది రాళ్లు చిత్రం కోసం చిరంజీవి కెమెరా ముందుకు వచ్చాడు. ఆ మూవీ డిలే కావడంతో ప్రాణం ఖరీదు మొదటగా విడుదలైంది. 1978లో చిరంజీవి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

    అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను చిరంజీవి 1980లో వివాహం చేసుకున్నారు. స్టార్ కమెడియన్ గా పరిశ్రమను ఏలుతున్న అల్లు రామలింగయ్య వర్తమాన నటుడిని అల్లుడిగా ఎందుకు చేసుకున్నారనే సందేహం చాలా మందిలో ఉంది. వివాహమయ్యే నాటికి చిరంజీవికి స్టార్డం లేదు. ఆయన సపోర్టింగ్, విలన్ రోల్స్ సైతం చేస్తున్నారు. కానీ చిరంజీవి నటుడిగా ఎదుగుతాడని అల్లు రామలింగయ్య నమ్మాడు.

    అల్లు రామలింగయ్య ఒక రోజు చిరంజీవితో మా అమ్మాయిని వివాహం చేసుకుంటావా? అని అడిగాడట. చిరంజీవి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడట. డబ్బు, పేరు, హోదా ఉన్న అల్లు రామలింగయ్య తనను అల్లుడు చేసుకోవడం ఏమిటని భావించాడట. ఆయన నిజంగానే అడుగుతున్నాడని తెలిసి, పేరెంట్స్ అంగీకారంతో ఓకే చెప్పాడట.

    అదే సమయంలో సురేఖను చేసుకోవడానికి ఓ కలెక్టర్ ముందుకు వచ్చాడట. కలెక్టర్, చిరంజీవిలలో సురేఖను ఎవరికి ఇవ్వాలనే సందేహం అల్లు రామలింగయ్య వెంటాడిందట. సన్నిహితుల సలహా తీసుకోవడం మంచిదని నటుడు ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి విషయం చెప్పాడట. అప్పుడు ప్రభాకర్ రెడ్డి.. అమ్మాయికి ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి కోడలిగా పంపినా సుఖపడదు. సంతోషంగా ఉండదు. అసలు అమ్మాయి నిర్ణయం ఏమిటో తెలుసుకుని, తన ఇష్టం ప్రకారం పెళ్లి చేయమని, అన్నారట.

    దాంతో అల్లు రామలింగయ్య సురేఖ అభిప్రాయం అడగ్గా … చిరంజీవిని వివాహం చేసుకుంటానని చెప్పిందట. అమ్మాయి చెప్పిందే తడవుగా ఆలస్యం లేకుండా చిరంజీవి-సురేఖల వివాహం చేశాడట అల్లు రామలింగయ్య. ఈ బంధం తర్వాత చిరంజీవి-అల్లు రామలింగయ్య పరస్పరం సహకరించుకుని ఎదిగారు. చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగాక, గీతా ఆర్ట్స్ బ్యానర్ బాగా అభివృద్ధి చెందింది.

    చిరంజీవి కోసం నిర్మాతలు ఎగబడే రోజుల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి పలు హిట్ చిత్రాలు చేశారు. కుర్రాడిలో విషయం ఉంది. ఎప్పటికైనా ఎదుగుతాడని భావించిన అల్లు రామలింగయ్య ఆలోచన నిజమైంది. తిరుగులేని హీరోగా చిరంజీవి చిత్ర పరిశ్రమను ఏలారు. చిరంజీవి నటించిన అనేక చిత్రాల్లో అల్లు రామలింగయ్య విలన్, కమెడియన్ రోల్స్ చేశారు.