https://oktelugu.com/

వ‌కీల్ సాబ్ బెనిఫిట్ షోలు.. ధ‌ర ఎంతో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీమూవీ ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. స‌రిగ్గా ప‌క్షం రోజుల్లో థియేట‌ర్లో సంద‌డి చేయ‌బోతోందీ సినిమా. దీంతో.. సైలెంట్ గా ఉన్న ప్ర‌చారాన్ని త‌ట్టిలేపింది యూనిట్‌. ఫ్యాన్స్ కూడా వెంట‌నే అట్రాక్ట్ అయిపోయి.. సినిమా బెనిఫిట్ షోల గురించి అప్పుడే డిస్క‌ష‌న్ స్టార్ట్ చేశారు. ఏయే థియేట‌ర్ల‌లో మిడ్ నైట్‌, బెనిఫిట్ షోల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు? టికెట్ రేటు ఎంత? అనే విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి. Also Read: జాతిరత్నం నవీన్ పోలిశెట్టి […]

Written By:
  • Rocky
  • , Updated On : March 25, 2021 / 09:43 AM IST
    Follow us on


    ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీమూవీ ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. స‌రిగ్గా ప‌క్షం రోజుల్లో థియేట‌ర్లో సంద‌డి చేయ‌బోతోందీ సినిమా. దీంతో.. సైలెంట్ గా ఉన్న ప్ర‌చారాన్ని త‌ట్టిలేపింది యూనిట్‌. ఫ్యాన్స్ కూడా వెంట‌నే అట్రాక్ట్ అయిపోయి.. సినిమా బెనిఫిట్ షోల గురించి అప్పుడే డిస్క‌ష‌న్ స్టార్ట్ చేశారు. ఏయే థియేట‌ర్ల‌లో మిడ్ నైట్‌, బెనిఫిట్ షోల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు? టికెట్ రేటు ఎంత? అనే విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి.

    Also Read: జాతిరత్నం నవీన్ పోలిశెట్టి హిందీ మూవీ కష్టాలు కన్నీళ్లు..

    ఇప్ప‌టికే సినిమా ట్రైల‌ర్ కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ రావ‌డంతో ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ట్రైల‌ర్ లాంఛ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది యూనిట్‌. మ‌రోవైపు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మెగాస్టార్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ ను ఆహ్వానించి ఘ‌నంగా వేడుక చేయ‌బోతున్నారు. దీంతో.. వ‌కీల్ సాబ్ ప్ర‌మోష‌న్ పీక్ స్టేజ్ కు చేర‌బోతోంది.

    ఈ ప్ర‌చారం నేప‌థ్యంలోనే.. స్పెష‌ల్ షోల డిస్క‌ష‌న్ కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు మిడ్ నైట్ నుంచే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. వైజాగ్ లో ఈ షోల‌ను వేసేందుకు రెండు థియేట‌ర్ల‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు కూడా ప్ర‌చారం సాగుతోంది. ఈ షోలో టిక్కెట్ ధ‌‌ర రూ.1500 గా నిర్ణ‌యించ‌బోతున్నార‌ని టాక్‌. గతంలోనూ ప‌లువురు స్టార్ల సినిమాల‌ను కూడా ఇదేవిధంగా ప్లే చేశారు.

    Also Read: మరో స్టార్ హీరోకు కరోనా పాజిటివ్

    ఇక‌, రిలీజ్ రోజున ఏపీలో మొత్తం 15 థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఉద‌యం 4 నాలుగు గంట‌ల‌కు ఒక షో, 7 గంట‌ల‌కు మ‌రో షో వేయ‌నున్నార‌ట‌. ఈ షోల‌కు టిక్కెట్ ధ‌ర రూ.500 గా నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి, ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న‌ది తెలియ‌దుగానీ.. ప్ర‌చారం మాత్రం ముమ్మ‌రంగా సాగుతోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌, ట్రైల‌ర్ లాంచిగ్ త‌ర్వాత ఈ ప్ర‌చారం జోరు మ‌రింత పెరిగేలా క‌నిపిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్