మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఏం చేయాలంటే..?

దేశంలో కంప్యూటర్ పై అవగాహన ఉన్న చాలామంది జీమెయిల్ ను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. ప్రతి జీమెయిల్ అకౌంట్ లో 15జీబీ వరకు ఫ్రీ స్పేస్ కు అనుమతి ఉంటుంది. 15జీబీ కంటే ఎక్కువగా స్టోర్ చేయాలంటే మాత్రం స్టోర్ చేయడం సాధ్యం కాదు. గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్, గూగుల్ స్లయిడ్స్, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ అన్నింటిలో కలిపి మొత్తం 15జీబీ డేటాను స్టోర్ చేసుకోవడం సాధ్యమవుతుంది. Also Read: వన్ ప్లస్ ఫోన్ […]

Written By: Navya, Updated On : March 25, 2021 11:02 am
Follow us on

దేశంలో కంప్యూటర్ పై అవగాహన ఉన్న చాలామంది జీమెయిల్ ను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. ప్రతి జీమెయిల్ అకౌంట్ లో 15జీబీ వరకు ఫ్రీ స్పేస్ కు అనుమతి ఉంటుంది. 15జీబీ కంటే ఎక్కువగా స్టోర్ చేయాలంటే మాత్రం స్టోర్ చేయడం సాధ్యం కాదు. గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్, గూగుల్ స్లయిడ్స్, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ అన్నింటిలో కలిపి మొత్తం 15జీబీ డేటాను స్టోర్ చేసుకోవడం సాధ్యమవుతుంది.

Also Read: వన్ ప్లస్ ఫోన్ ఫ్రీగా పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

ఒకవేళ స్టోరేజ్ ఫుల్ అయితే కొత్తగా స్టోర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో పాటు మెయిల్స్ పంపడానికి కానీ కొత్త మెయిల్స్ పొందడానికి కానీ సాధ్యం కాదు. జీమెయిల్ స్పేస్ అయిపోయిన వాళ్లు మనీ పే చేసి స్పేస్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్పేస్ ను కొనుగోలు చేయడం ఇష్టం లేని వాళ్లు మరొక జీమెయిల్ ను క్రియేట్ చేసుకోవడం లేదా మెయిల్ లో ఉన్న ఫైల్స్, ఫోటోస్ ను తొలగించుకోవాల్సి ఉంటుంది.

జీమెయిల్ లో సోషల్, స్పామ్, ప్రమోషన్ ఆప్షన్స్ లో బల్క్ లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. వాటిని డిలేట్ చేయడం ద్వారా కొంత స్పేస్ లభిస్తుంది. జీమెయిల్ అకౌంట్ లో క్లట్టర్ ఫోల్డర్ ఉంటుంది. ఈ క్లట్టర్ ఫోల్డర్ ను క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా కొంత స్పేస్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రమోషనల్ మెసేజ్ లు ఎక్కువగా ఏ మెయిల్ నుంచి వస్తున్నాయో చెక్ చేసి ఆ మెయిల్ ను సెర్చ్ బార్ లో పేస్ట్ చేయడం ద్వారా కూడా ప్రమోషనల్ ఈమెయిల్స్ ను సులభంగా డిలేట్ చేయవచ్చు.

Also Read: ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్ ను మరో ఫోన్ కు వాడకూడదా..?

జీమెయిల్ స్టోరేజ్ ను దృష్టిలో ఉంచుకుని అవసరం ఉన్నవాటిని మాత్రమే ఉంచుకుంటూ అవసరం లేని వాటిని డిలేట్ చేయడం ద్వారా కూడా కొంతవరకు ఫ్రీ స్పేస్ ను పొందవచ్చు. అనవరమైనవి డిలేట్ చేసిన తరువాత ట్రాష్ ను ఒకసారి చెక్ చేసి అందులో అవసరం లేనివి డిలేట్ చేసినా కూడా ఎక్కువ మొత్తం స్పేస్ ను పొందవచ్చు.