https://oktelugu.com/

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కి అరుదైన వ్యాధి? శరీరంలో ఆ మార్పుకు కారణం అదేనా?

హీరోయిన్ ఐశ్యర్య రాయ్ అనారోగ్యం బారినపడ్డారన్న వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందుకు ఒక సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది. అసలు ఐశ్యర్య ఆరోగ్యం పై పుకార్లు చెలరేగడానికి కారణం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : October 12, 2024 / 09:00 AM IST

    Aishwarya Rai(2)

    Follow us on

    Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. భర్త అభిషేక్ బచ్చన్ తో ఆమెకు విబేధాలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు ఐశ్యర్య రాయ్ ఒకటే హాజరైంది. కూతురు ఆరాధ్యతో కలిసి ఆమె వేడుకకు వచ్చారు. మరోవైపు అభిషేక్ బచ్చన్ తన పేరెంట్స్ అయిన అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ లతో పెళ్ళిలో పాల్గొన్నారు. అయితే ఇవ్వన్నీ రూమర్స్ అంటున్నారు. ఐశ్వర్య చేతికి వెడ్డింగ్ రింగ్ ఇంకా అలానే ఉంది.

    తాజాగా మరో పుకారు చెలరేగింది. ఐశ్యర్య రాయ్ అనారోగ్యం బారిన పడ్డారు అనేది, ఈ వార్త సారాంశం. ఐశ్యర్య లావుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఆమె సన్నజాజి తీగలా నాజూగ్గా ఉండేది. కానీ బరువు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం బారిన పడ్డారనే సందేహం ఒక నెటిజెన్ వ్యక్తం చేశాడు. రెడిట్ యూజర్ ఈ మేరకు పోస్ట్ పెట్టాడు. ఐశ్వర్య రాయ్ అనారోగ్యానికి గురై ఉండొచ్చు. అందుకే ఆమె లావు అవుతున్నారు. ఇది నా సందేహం మాత్రమే అని, సదరు నెటిజెన్ కామెంట్ చేశాడు.

    1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. అనంతరం 1997లో తమిళ చిత్రం ఇరువుర్ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. సౌత్ లో తక్కువ చిత్రాలు చేసిన ఐశ్యర్య రాయ్ బాలీవుడ్ కి పరిమితమైంది. అక్కడ తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె కొన్ని ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. నటుడు వివేక్ ఒబెరాయ్ తో కొన్నాళ్ళు ఆమె రిలేషన్ నడిపింది. అనంతరం అతడితో బ్రేకప్ అయ్యింది.

    సల్మాన్ ఖాన్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. అనంతరం 2007లో ఐశ్యర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానం. ఇటీవల ఆమె మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్, పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రాలు చేసింది. ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఐశ్యర్య రాయ్ కెరీర్ నెమ్మదించింది అని చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్ అనంతరం ఆమె మరో చిత్రం చేయలేదు. ఆమె అభిమానులకు ఇది నిరాశ పరిచే వార్త అనడంలో సందేహం లేదు.

    కాగా ఐశ్యర్య రాయ్ తెలుగులో ఒక్క చిత్రం కూడా చేయకపోవడం విశేషం. అయితే 1999లో విడుదలైన రావోయి చందమామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. నాగార్జున, అంజలా జవేరి జంటగా నటించారు. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అని చెప్పాలి.