https://oktelugu.com/

Prabhas: ఇన్ని సమస్యలతో ప్రభాస్ భవిష్యత్తులో సినిమాలు చేయగలడా..? ఆశ్చర్యానికి గురి చేస్తున్న షాకింగ్ నిజాలు!

ఆర్టిస్టులను పిండేస్తాడు. అలా ప్రభాస్, రానా ని సినిమా కథ కి తగ్గట్టుగా బాడీ షేప్స్ తొందరగా వచ్చేందుకు కొన్ని డైట్స్ ని అనుసరించమని రాజమౌళి చెప్పాడట. ఇద్దరూ రాజమౌళి చెప్పినవి తూచా తప్పకుండ అనుసరించి ఆ డైట్ ని తీసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 3, 2025 / 04:40 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాపించేలా చేసిన ప్రముఖులలో ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. అప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమాల జోరు మన టాలీవుడ్ లో ఉండేది కాదు. బాహుబలి నుండే ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. మన అందరికీ తెలిసిందే. రాజమౌళి విజన్ కి తగ్గట్టు అన్ని అలా జరిగిపోవాలి. అలా జరిగే వరకు ఆయన నిద్రపోడు. ఆర్టిస్టులను పిండేస్తాడు. అలా ప్రభాస్, రానా ని సినిమా కథ కి తగ్గట్టుగా బాడీ షేప్స్ తొందరగా వచ్చేందుకు కొన్ని డైట్స్ ని అనుసరించమని రాజమౌళి చెప్పాడట. ఇద్దరూ రాజమౌళి చెప్పినవి తూచా తప్పకుండ అనుసరించి ఆ డైట్ ని తీసుకున్నారు.

    ఇద్దరి శరీరాలు రాజమౌళి కోరుకున్నట్టు తయారయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక వీళ్లిద్దరు ఆ డైట్ ని ఫాలో అవ్వడం మానేశారు. దీంతో రానా ఎంత ఇబ్బందులకు గురి అయ్యాడో మన అందరం చూస్తూనే ఉన్నాం. బాహుబలి సిరీస్ తర్వాత వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అని అనుకుంటే, అసలు సినిమాలు చేయడమే పూర్తిగా తగ్గించేసాడు రానా. అప్పుడప్పుడు మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నాడు. విదేశాలకు వెళ్లి ఎన్నో శస్త్ర చికిత్సలు కూడా చేయించుకున్నాడు. కేవలం రానా మాత్రమే కాదు, ప్రభాస్ కూడా ఇప్పుడు ఆ డైట్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఏర్పడిన సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడట. ప్రతీ ఏడాది ఆయన విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకొని, ఇండియా కి వచ్చి షూటింగ్స్ చేయాల్సిన పరిస్థితి. బాగా గమనించి చూస్తే ప్రభాస్ ముఖం లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్నటువంటి గ్లో ఇప్పుడు లేదు అంటూ అభిమానులు కూడా బాధ పడుతూ ఉంటారు.

    ప్రస్తుతానికి ప్రభాస్ తాత్కాలికంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఆయన విదేశాలకు వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ కి ఉన్నటువంటి ఈ ఆరోగ్య సమస్యల కారణంగా భవిష్యత్తులో ఆయన సినిమాల మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని, తక్షణమే ఆయన ఈ సమస్యల నుండి బయటపడాలని అభిమానులు ప్రతిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ‘రాజా సాబ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటి వరకు 80 శాతం పూర్తి అయ్యింది. మిగిలిన షూటింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్ 10 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ఒకవేళ ఆలస్యం అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.