Ind Vs Aus 5th Test: ఆస్ట్రేలియా ఆటగా కోన్ స్టాస్ వాపుతో కొట్టుకుంటున్నాడు. మదంతో విర్రవీగుతున్నాడు. 19 సంవత్సరాల ఈ బుడతడు మైదానంలో ఎగసెక్కాలు ఆడుతున్నాడు. కోన్ స్టాస్ మెల్ బోర్న్ టెస్ట్ ద్వారా ఆస్ట్రేలియా జట్టులోకి ప్రవేశించాడు. తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో దూకుడుగా ఆడాడు. జట్టులోకి ఎంట్రీకి ముందే బుమ్రా ను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని.. కచ్చితంగా అతడిని నిలువరిస్తానని పేర్కొన్నాడు. చెప్పినట్టుగానే అలానే ఆడాడు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఆడుతోంది తొలి టెస్ట్ అయినప్పటికీ.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో ఫోర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో బుమ్రా కోన్ స్టాస్ ను 8 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐతే టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా అవుట్ అయినప్పుడు విచిత్రంగా సంకేతాలు చేసి..కోన్ స్టాస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి వ్యవహార శైలిపై సీనియర్ క్రికెటర్లు అభ్యంతర వ్యక్తం చేశారు. అంతకుముందు ఇదే టెస్టులో కోన్ స్టాస్ భుజాన్ని విరాట్ కోహ్లీ తాకాడు. ఈ పరిణామాన్ని సీరియస్ గా భావించిన రిఫరీ.. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది.
మళ్లీ ఇప్పుడు
సిడ్ని టెస్ట్ లోనూ కోన్ స్టాస్ తన వైఖరి మార్చుకోలేదు. పైగా టీమిండియా కెప్టెన్ బుమ్రా ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.. వికెట్లు తీయాలి. దానికోసమే ఎదురుచూస్తున్నా.. హితుడా అంటూ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీనికి బుమ్రా కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యాడు. చివరికి ఖవాజా ను వెనక్కి పంపించాడు. ఖవాజా అవుట్ కాకముందు కేఎల్ రాహుల్ కూడా.. బుమ్రా కోన్ స్టాస్ గొడవపై స్పందించాడు. “నువ్వు ఇంత మందిలో ముందుగా వెళ్ళు.. ఆ తర్వాత మిగతా వాళ్ళు నిన్ను అనుసరిస్తారని” బుమ్రా ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అతడు అన్నట్టుగానే బుమ్రా ఖవాజా వికెట్ తీయడమే ఆలస్యం.. టీమిండియాలోని మిగతా ఆటగాళ్లు మొత్తం జస్ ప్రీత్ ను అనుసరించారు.. కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెల్ బోర్న్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేసిన కోన్ స్టాస్.. సెకండ్ ఇన్నింగ్స్ లో 8 పరుగులకే అవుట్ అయ్యాడు. అప్పటికే అతడికి సగం గర్వభంగాన్ని టీమిండియా కలిగించింది. ఇప్పుడు సిడ్నీ టెస్టులో పూర్తిస్థాయిలో కలిగిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని.. కోన్ స్టాస్ అదుపులో ఉండాలని.. నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
KL Rahul once said ‘You go after one of us, all 11 will come right back’
Thats true all 11 went over him after that
wicketThis Konstas Kid first messed with Kohli, and now he’s going after Bumrah
Someone should tell him he’s challenging his owners https://t.co/pbx3OKjyZW— (@DilipVK18) January 3, 2025