https://oktelugu.com/

Dulquer Salmaan: ‘కల్కి’ చిత్రంలో నేను ఉంటాను అనే విషయమే నాకు తెలియదు అంటూ దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్!

వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు. ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 22, 2024 / 12:55 PM IST

    Dulquer Salmaan

    Follow us on

    Dulquer Salmaan: ఈమధ్య కాలం లో ఇతర భాషలకు సంబంధించిన కుర్ర హీరోలు మన టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మలయాళం స్టార్ హీరోలలో ఒకరైన దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే ఆయన టాలీవుడ్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన మన తెలుగు లో హీరో గా చేసిన రెండవ చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు. ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ ని అనేక ప్రశ్నలు అడిగారు విలేఖరులు. ఒక రిపోర్టర్ ఆయనతో మాట్లాడుతూ ‘సీతారామం, కల్కి వంటి చిత్రాలతో మీరు తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. కల్కి 2 లో కూడా మీ పాత్రకు కొనసాగింపు ఉంటుందా’ అని అడుగుతాడు. దానికి దుల్కర్ సల్మాన్ సమాధానం చెప్తూ ‘అది మీరు నాగ అశ్విన్ గారిని అడగాలి. కల్కి చిత్రంలో నేను నటిస్తానని అసలు అనుకోలేదు. చివరి నిమిషం లో అలా జరిగిపోయింది. రేపు పార్ట్ 2 విషయంలో కూడా అంతే. ఒకవేళ నాకు అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కల్కి చిత్రంలో దుల్కర్ సల్మాన్ ప్రభాస్ కి గురువు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా, అమితాబ్ బచ్చన్ అశ్వథామగా కనిపించారు. పార్ట్ 2 లో కూడా ఈ క్యారెక్టర్స్ కొనసాగుతాయి. అయితే ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రభాస్ కి గురువుగా నటించాడు కాబట్టి ఆయనది పరశురాముడి క్యారక్టర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే కర్ణుడి గురువు పరశురాముడే కదా.

    అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, పరశురాముడు కూడా అశ్వథామ లాగా చిరంజీవి. అంటే ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. మరి దుల్కర్ సల్మాన్ ప్రభాస్ కి ఒక సైనికుడిగా ఎందుకు కనిపించాడు, అసలు దుల్కర్ సల్మాన్ పాత్ర ఏమిటి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్స్ గానే నిల్చింది. ఇదంతా పక్కన పెడితే ‘లక్కీ భాస్కర్’ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఈమధ్య కాలం లో ఇలాంటి కంటెంట్ సినిమాలు మన టాలీవుడ్ లో రాలేదు. లక్కీ భాస్కర్ ట్రైలర్ ని చూస్తుంటే మంచి కంటెంట్ ఉన్న ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఆడియన్స్ కి అనిపించింది. మరి ఈ చిత్రంతో హీరోగా దుల్కర్ సల్మాన్ మరో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.