https://oktelugu.com/

Unstoppable 4: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూర్యచంద్రులు లాంటి వారంటూ పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య..వైరల్ అవుతున్న వీడియో!

బాలయ్య బాబు మాట్లాడుతూ 'ఆకాశం లో సూర్య చంద్రులు..ఆంధ్ర ప్రదేశ్ లో బాబు గారు, కళ్యాణ్ బాబు గారు అని అంటున్నారు' అని అంటాడు. దానికి చంద్రబాబు నవ్వుతూ 'మీరు ఎలా అయితే అన్ స్టాపబుల్ గా ఉన్నారో. రాజకీయాల్లో మేము కూడా అన్ స్టాపబుల్ గా ఉన్నాము' అని అంటాడు. కేవలం నిమిషం నిడివి ఉన్న ప్రోమో ని చూసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు టీడీపీ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 22, 2024 / 12:51 PM IST

    Unstoppable 4(1)

    Follow us on

    Unstoppable 4: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో మూడు సీజన్స్ ని పూర్తి చేసుకొని నాల్గవ సీజన్ లోకి అడుగుపెట్టింది. మొదటి ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ ఈనెల 25వ తారీఖున ఆహా మీడియా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ని నిన్న రాత్రి విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ముందుగా బాలయ్య బాబు చంద్రబాబు నాయుడు ని గ్రాండ్ గా ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ప్రోమో లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కక్ష్యా రాజకీయాలకు తెరలేపారు. కానీ నేను మాత్రం లక్ష్మణ రేఖ డాటను. కానీ తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు’ అని అంటాడు.

    ఆ తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ ‘ఆకాశం లో సూర్య చంద్రులు..ఆంధ్ర ప్రదేశ్ లో బాబు గారు, కళ్యాణ్ బాబు గారు అని అంటున్నారు’ అని అంటాడు. దానికి చంద్రబాబు నవ్వుతూ ‘మీరు ఎలా అయితే అన్ స్టాపబుల్ గా ఉన్నారో. రాజకీయాల్లో మేము కూడా అన్ స్టాపబుల్ గా ఉన్నాము’ అని అంటాడు. కేవలం నిమిషం నిడివి ఉన్న ప్రోమో ని చూసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు టీడీపీ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఈరోజు, లేదా రేపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ప్రోమో ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆహా మీడియా టీం. ఆ ప్రోమో లో చంద్రబాబు నాయుడు తో బాలయ్య ఆడించిన టాస్కులు, మధ్యలో ఫోన్ కాల్ సంభాషణ వంటివి ఉంటాయి. ఫోన్ కాల్ సంభాషణ ప్రతీ అతిథి వచ్చినప్పుడు ఉండే సంగతి అందరికీ తెలిసిందే. గత సీజన్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ తో ఫోన్ కాల్ మాట్లాడించారు. ఈ సంభాషణ ఎంత సరదాగా ఉన్నిందో అందరికీ తెలిసిందే.

    అలా చంద్రబాబు తో జరిగిన ఎపిసోడ్ లో కూడా ఒక ఫోన్ కాల్ సంభాషణ ఉంటుంది. అది ఆయన తనయుడు నారా లోకేష్ కి చేస్తాడా?, లేదా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చేస్తాడా అనేది తెలియాల్సి ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఉండుంటే చాలా బాగుండేది అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చివరి నిమిషం వరకు ఇద్దరినీ ఈ ఎపిసోడ్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రాలేకపోయాడు. కానీ రాబోయే ఎపిసోడ్స్ లో కచ్చితంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.