‘పుష్ప’ టీమ్ ను కరోనా ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్ ను జనవరి 5 నుండి ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సహా మెగాస్టార్ కుటుంబంలో కొంతమందికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో.. అల్లు అర్జున్ రెండు వారాల పాటు షూటింగ్ వెళ్లకుండా ఇంటిలోనే నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నాడట. దాంతో పుష్ప షూటింగ్ ను జనవరి 16 తరువాత నుండి పెట్టుకోవాలని నిర్ణయించారట. అసలుకే ఇప్పటికే పుష్ప షూట్ బాగా ఆలస్యం అయింది అనుకుంటే.. ఇప్పుడు కరోనా రెండో దశతో, మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
Also Read: సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
నిజానికి లాస్ట్ షెడ్యూల్ లోనే పుష్పకు కరోనా భారీ షాక్ ఇచ్చింది. పుష్ప టీమ్ లాస్ట్ షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లోనే షూటింగ్ ని శరవేగంగా జరుపుతూ ఉండగా కరోనా కల్లోలం సృష్టించింది. ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఓ వ్యక్తి చనిపోయిన దురదృష్ట సంఘటన కూడా జరిగింది. అలాగే పుష్ప టీమ్ లో మొత్తం 20 మందికి కరోనా సోకింది. దాంతో షూటింగ్ ను దాదాపు నెల రోజుల పాటు పోస్ట్ ఫోన్ చేశారు. అప్పుడు సడెన్ గా షూటింగ్ ని రద్దు చేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చేయ్యడంతో అప్పుడు వేసిన సెట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి.
Also Read: నిహారిక పెళ్లి తర్వాత ప్లాన్.. దీంతో రద్దు !
అసలు పుష్ప టీమ్ లో వారికే ఒక్కసారిగా ఇంతమందికి కరోనా ఎలా సోకిందా అని ఇప్పటికీ పుష్ప మేకర్స్ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇప్పుడు బన్నీ ఫ్యామిలీని కూడా కరోనా టెన్షన్ పెడుతుంది. మరో వారం, పది రోజుల వరకు లక్షణాలు బయటపడవు కాబట్టి… ఆ తరువాతే క్లారిటీ రానుంది. అయితే అల్లు అర్జున్ కొంత వరకు సేఫ్ అని.. కరోనా పాజిటివ్ అని వచ్చిన ఎవ్వరితోనూ బన్నీ ఎప్పుడూ క్లోజ్ గా ఇంటరాక్షన్ అవ్వలేదని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్